FilmFare Awards 2021: రికార్డు క్రియేట్ చేసిన ‘తప్పాడ్’.. మరోసారి ఉత్తమ నటిగా తాప్సీ..
66th FilmFare Awards 2021: ఇటీవల నేషనల్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం రాత్రి 2021 సంవత్సరానికి
66th FilmFare Awards 2021: ఇటీవల నేషనల్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం రాత్రి 2021 సంవత్సరానికి బాలీవుడ్ 66వ ఫిల్మ్ ఫేర్ అవార్డులను ప్రకటించారు. అందులో తాప్సీ నటించిన తప్పాడ్ సినిమా ఏడు ట్రోఫీలను అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ తర్వాత గులాబో సీతాబో సినిమాకు ఆరు అవార్డులు వచ్చాయి.
ఈ 66వ ఫిల్మ్ ఫేర్ అవార్డులలో ఉత్తమ నటిగా తాప్సీ పన్నూ నిలవగా.. ఉత్తమ నటుడిగా దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ అవార్డులను అందుకున్నారు. అలాగే బెస్ట్ మేసేజ్ మూవీగా తప్పాడ్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది. ఇక తన్హాజీ.. ది అన్సంగ్ వారియర్ సినిమాతో బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు ఓంరౌత్. ఈ మేరకు తాప్సీ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా “రెస్పెక్ట్ అండ్ హ్యాపీనెస్ థ్యాంక్స్ అమృతా” అంటూ ట్వీట్ చేసింది.
View this post on Instagram
ఇక మిగతా అవార్డుల విషయానికి వస్తే..
ఉత్తమ చిత్రం: తప్పాడ్ ఉత్తమ దర్శకుడు: ఓంరౌత్ ఉత్తమ చిత్రం (విమర్శకులు) ప్రతీక్ వాట్స్ (ఈబ్ అల్లే ఓహ్) ఉత్తమ నటుడు ఇర్ఫా్న్ ఖాన్ (అంగ్రెజీ మీడియడం) ఉత్తమ నటుడు (క్రిటిక్స్).. అమితాబ్ బచ్చన్ (గులాబో సీతాబో) ఉత్తమ నటి తాప్సీ పన్నూ (తప్పాడ్) ఉత్తమ నటుడు (విమర్శకులు): టిల్లోటామా షోమ్ (సర్) సహాయక పాత్రలో ఉత్తమ నటుడు: సైఫ్ అలీ ఖాన్ (తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) సహాయక పాత్రలో ఉత్తమ నటి: ఫరూఖ్ జాఫర్ (గులాబో సీతాబో) ఉత్తమ కథ: అనుభవ్ సుశీలా సింగ్, మృన్మై లగూ వైకుల్ (తప్పాడ్) ఉత్తమ స్క్రీన్ ప్లే: రోహేనా గెరా (సర్) ఉత్తమ డైలాగ్స్: జుహి చతుర్వేది (గులాబో సీతాబో) ఉత్తమ డెబ్యూట్ దర్శకుడు: రాజేష్ కృష్ణన్ (లూట్‌కేస్) ఉత్తమ డెబ్యూట్ ఫిమేల్: ఆలయ ఎఫ్ (జవానీ జనేమాన్) ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: ప్రీతమ్ (లూడో) ఉత్తమ సాహిత్యం: గుల్జార్ (ఛాపాక్) ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: రాఘవ్ చైతన్య (తప్పాడ్ నుండి ఏక్ తుక్దా ధూప్) ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫీమెల్: అసీస్ కౌర్ (మలంగ్ టైటిల్ సాంగ్) లైఫ్ టైం అచీవ్‍మెంట్ అవార్డ్ ఇర్ఫా్న్ ఖాన్ ఉత్తమ యాక్షన్: రంజాన్ బులట్, ఆర్‌పి యాదవ్ (తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: మంగేష్ ఉర్మిలా ధక్డే (తప్పాడ్) ఉత్తమ సినిమాటోగ్రఫీ: అభిక్ ముఖోపాధ్యాయ్ (గులాబో సీతాబో) ఉత్తమ కోరియోగ్రఫీ: ఫరా ఖాన్ (దిల్ బెచారా టైటిల్ సాంగ్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఈ (గులాబో సీతాబో) ఉత్తమ ఎడిటింగ్: యషా పుష్ప రామ్‌చందాని (తప్పాడ్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మానసి ధ్రువ్ మెహతా (గులాబో సీతాబో) ఉత్తమ సౌండ్ డిజైన్: కామోద్ ఖరాడే (తప్పాడ్) ఉత్తమ వీఎఫ్ఎక్స్: ప్రసాద్ సుతార్, NY Vfxwaala (తన్హాజీ: ది అన్సంగ్ వారియర్)
Also Read: