AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vakeel Saab Trailer Review: వేరే లెవల్‌‌‌‌లో ‘వకీల్ సాబ్’ ట్రైలర్.. పూనకాలతో ఊగిపోతున్న అభిమానులు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంత కాలం సినిమాలకు దూరమై ప్రజలకు దగ్గరయేందుకు రాజకీయకీయ

Vakeel Saab Trailer Review: వేరే లెవల్‌‌‌‌లో 'వకీల్ సాబ్' ట్రైలర్.. పూనకాలతో ఊగిపోతున్న అభిమానులు..
Vakeel Saab
Rajeev Rayala
|

Updated on: Mar 29, 2021 | 6:59 PM

Share

Pawan Kalyan Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంత కాలం సినిమాలకు దూరమై ప్రజలకు దగ్గరయేందుకు రాజకీయకీయ అరంగేట్రం చేసారు పవర్ స్టార్. ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ హిట్ సినిమా ‘పింక్’ ను తెలుగులో రీమేక్ చేసారు. వకీల్ సాబ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటించారు. ఇక ఈ సినిమా కోసం ఎప్పటినుంచో అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ మొదలైన దగ్గరనుంచి ఏ చిన్న అప్డేట్ వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూసారు ఫ్యాన్స్.

అభిమానులు నిరీక్షణకు ఇన్నాళ్లకు తెరపడింది. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ నుంచి ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్ రాబోతుందని తెలిసిన దగ్గర నుంచి అభిమానుల సందడి మాములుగా లేదు. పవర్ స్టార్ పోస్టర్స్ తో కటౌట్స్ తో  హంగామా చేశారు అభిమానులు. వకీల్ సాబ్ ట్రైలర్ ను డైరెక్ట్ గా ధియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇక థియేటర్స్ లో అభిమానుల సందడి మాములుగా లేదు. పవర్ స్టార్.. పవర్ స్టార్ అనే నినాదాలు ఆకాశాన్ని అంటాయి.

ఇక వకీల్ సాబ్ ట్రైలర్ విషయానికొస్తే.. ముగ్గురు అమ్మాయి అనుకోని విధంగా ఒక కేసులో చిక్కుకుంటారు. ఆ ముగ్గురి తరపున వాదించడానికి రంగంలోకి దిగుతాడు మన వకీల్ సాబ్. “మిస్ పల్లవి ఆర్ యూ వర్జిన్” అంటూ ప్రకాష్ రాజ్ నివేద థామస్ ను ప్రశ్నించడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అలాగే ఆ ముగ్గురి పై అన్యాయంగా నిందలు వేస్తూ.. కేసును తప్పుదోవ పట్టించేందుకు  ప్రకాష్ రాజ్ చూస్తుంటాడు. “అమాయకులైన నా క్లయింట్ పరువు తీయాలని చూస్తున్నారని ప్రకాష్ రాజ్ అరుస్తూ.. చెప్తుండగా అబ్జెక్షన్ యువరానర్..నందా జీ “అంటూ కోపంగా లేస్తాడు పవన్.. ఆ ముగ్గురు యువతులకు న్యాయం చేయడానికి పవన్ కోర్ట్ లో ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. “ఇలాంటి అమ్మాయిలకు ఇలానే జరుగుద్ది అని అవతలి వ్యక్తి అనగానే .. అలా జరగొద్దు, జరగకూడదు” అంటూ పవన్ అగ్రెసివ్ గా చెప్పిన డైలాగ్ అభిమానుల చేత విజిల్స్ కొట్టించింది. చివరిగా “ఆర్ యూ వర్జిన్ అంటూ పవన్ ప్రకాష్ రాజ్ క్లయింట్ ను అడగ్గా అబ్జెక్షన్ యువరానర్ అంటూ ప్రకాష్ రాజ్ లేస్తాడు.. దాంతో పవన్ వెంటనే.. మీరైతే అమ్మాయిలను అడగొచ్చా మేము మాత్రం అబ్బాయిలను అడగొద్దా.. ఏం న్యాయం నందా జీ.. కూర్చోండి.. కూర్చోండి” అంటూ పవన్ అంటారు దాంతో ట్రైలర్ ముగుస్తుంది. ఇక తమన్ అందించిన బ్యాగ్రౌండ్  మ్యూజిక్ ట్రైలర్ ను వేరే లెవల్ కు తీసుకెళ్లింది. ఇక పవన్ అభిమానులకు కావాల్సినంత స్టఫ్ ట్రైలర్ లో ఉంది. పవన్ ఎలివేషన్స్ ట్రైలర్ కే హైలైట్ అని చెప్పాలి. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి ..