Mahesh Babu Bollywood: మహేష్‌ బాబు బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైందా.? ఆ సినిమాతోనే బీటౌన్‌కి వెళ్లనున్నాడా.?

Mahesh Babu Bollywood: మహేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్‌ దర్శకుడు మధు మాటెన వర్మ దర్శకత్వంలో 3డీ రామాయణం తెరకెక్కనున్న విషయం తెలిసిందే...

Mahesh Babu Bollywood: మహేష్‌ బాబు బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైందా.? ఆ సినిమాతోనే బీటౌన్‌కి వెళ్లనున్నాడా.?
Mahesh Babu Bollywood Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 29, 2021 | 6:10 PM

Mahesh Babu Bollywood: టాలీవుడ్‌ అగ్రహీరోల్లో స్టార్‌ హీరో మహేష్‌ బాబు ఒకరు. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే మహేష్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదిచున్నాడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడీ అమ్మాయిల కలల రాకుమారుడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమాల హవా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు తమ చిత్రాలను ఏక కాలంలో బాలీవుడ్‌లోనూ విడుదల చేస్తున్నారు. ఇక ప్రభాస్‌లాంటి హీరోలైతే ఏకంగా హిందీ డైరెక్టర్లతోనే నటిస్తున్నారు. అయితే ఈ రేసులో మహేష్‌ కాస్త వెనకబడ్డాడనే భావన ఆయన అభిమానుల్లోనూ కలుగుతోంది. అయితే గతంలో బాలీవుడ్‌ ఎంట్రీపై స్పందించిన మహేష్‌ తనకు ఇప్పట్లో ఆ ఆలోచన లేదని తేల్చి చెప్పాడు. కానీ తాజాగా వస్తోన్న వార్తల ఆధారంగా మహేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్‌ దర్శకుడు మధు మాటెన వర్మ దర్శకత్వంలో 3డీ రామాయణం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాలో దీపికా పదుకొణె సీతగా నటిస్తుండగా.. రాముడి పాత్రలో హృతిక్‌ రోషన్‌ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే దర్శకుడు రాముడి పాత్ర కోసం టాలీవుడ్‌ ప్రిన్స్‌ను అప్రోచ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే మొదట ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌ను తీసుకోవాలని భావించారు.. కానీ ఓంరౌత్‌ ఆదిపురుష్‌లో ప్రభాస్‌ను తీసుకోవడంతో మధు ఆ ఆలోచనను విరమించుకున్నాడనీ వార్తలు వచ్చాయి.

Also Read: Vakeel Saab Trailer: లాయర్ గా తన వాగ్ధాటితో అలరిస్తున్న పవన్ కళ్యాణ్… ఫ్యాన్స్ షడ్రుచుల విందేగా..

pawan kalyan Vakeel Saab Trailer:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ లాంచ్ ( వీడియో ).

Harbhajan Movie: లైఫ్‌లో మజా కోసం హర్భజన్‌ ఏం చేస్తాడో తెలుసా..? నవ్వులు పూయిస్తోన్న బజ్జీ కొత్త సినిమా సాంగ్‌..