Vakeel Saab Trailer: లాయర్ గా తన వాగ్ధాటితో అలరిస్తున్న పవన్ కళ్యాణ్… ఫ్యాన్స్‌కు షడ్రుచుల విందేగా..

Pawan kalyan Vakeel Saab Trailer:అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆంధ్రా, సీడెడ్, నైజాం లోని ఏ సెంటర్స్ లో వకీల్ సాబ్ ట్రైలర్ మెగాభిమానుల చేతుల మీదుగా చిత్ర నిర్మాణ సంస్థ...

Vakeel Saab Trailer: లాయర్ గా తన వాగ్ధాటితో అలరిస్తున్న పవన్ కళ్యాణ్...  ఫ్యాన్స్‌కు  షడ్రుచుల విందేగా..
Vakeel Saab
Follow us
Surya Kala

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 29, 2021 | 7:00 PM

Vakeel Saab Trailer: అభిమానులకు ఉగాది పండుగను ముందే తెచ్చారు వకీల్ సాబ్ చిత్ర యూనిట్. షడ్రుచుల విందును ముందే అందించారు. ఫ్యాన్స్  ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఆంధ్రా, సీడెడ్, నైజాం లోని ఏ సెంటర్స్ లో వకీల్ సాబ్ ట్రైలర్ మెగాభిమానుల చేతుల మీదుగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేసింది. మనం సినిమాకు వెళ్లకుండా ఉండాల్సింది అంటూ మొదలైన ట్రైలర్… ఇలాంటి అమ్మాయిలకు అలాగే జరుగుతుందని అంటే.. జరగకూడదు అంటూ పవన్ లాయర్ గా వాదిస్తున్నాడు.. ఇక ప్రతివాదిగా ప్రకాష్ రాజ్ .. పవన్ కళ్యాణ్ కు మధ్య జరిగే వాదప్రతివాదనలతో ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో పూనకాలు తెప్పిస్తుంది అని తెలుస్తోంది.

అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మెగా వారసుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టాడు పవన్ కళ్యాణ్. హిట్ ప్లాప్ లతో సంబంధంలేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. రాజకీయాల్లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల ముందు అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు. దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత వెండి తెరపై బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీ రీమేక్ గా వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టీజర్ సంక్రాంతి కానుకగా విడుదలైంది. పవన్ కళ్యాణ్ కోర్టు సీన్స్ తో పాటు యాక్షన్ సీన్స్ తో కట్ అయ్యిన టీజర్ రికార్డ్స్ సునామీ సృష్టించింది. కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ కూడా ఆలస్యమైంది. దీంతో వేసవి వినోదంగా వకీల్ సాబ్ రానుంది. ఓ వైపు థియేట్రికల్ రైట్స్ భారీ రేంజ్ లో బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్ తో పాటు డిజిటల్ రైట్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి.

ఈ ట్రైలర్‌కు గూస్‌ బమ్స్‌ వచ్చే రేంజ్‌లో బీజీఎం ను ప్రిపేర్‌ చేసిన తమన్‌.. ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఎస్ స్పీకర్స్‌ గెట్‌ రెడీ .. వకీల్ సాబ్‌ కీడో ఇన్‌ మీ అంటూ.. టెక్ట్‌ రాసి.. ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో బ్యాక్‌ గ్రౌండ్‌లో వకీల్ సాబ్‌ బీజీఎం వినిపిస్తుండగా… కంప్లీట్‌ బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ అవుట్ ఫిట్‌లో.. స్టైలిష్ మూవ్స్‌ ఇచ్చాడు తమన్‌. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వేణు శ్రీరాం దర్శకత్వంలో దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నివేదా థామస్, అంజలి కీలక పాత్రలో కనిపించనున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు