సుశాంత్ ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ న్యూపోస్టర్ విడుదల.. స్టైలిష్ లుక్‏లో యంగ్ హీరో..

Sushanth Akkineni: అక్కినేని యంగ్ హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'.

సుశాంత్ 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' న్యూపోస్టర్ విడుదల.. స్టైలిష్ లుక్‏లో యంగ్ హీరో..
Sushanth Akkineni
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 30, 2021 | 7:05 AM

Sushanth Akkineni: అక్కినేని యంగ్ హీరో సుశాంత్ ప్రధాన పాత్రలో ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‏గా నటిస్తుంది. ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి- ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‏కు మంచి స్పందన లభించింది. తాజాగా హోలీ ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్.

తాజాగా రిలీజ్ అయిన్ పోస్టర్లో హీరో సుశాంత్ అలాగే హీరోయిన్ మీనాక్షి ఇద్దరూ కూడా బైక్ రైడ్‏కు వెళ్లోచ్చినట్లుగా పోస్ట్రర్ చూస్తుంటే అర్థమవుతుంది. హీరోహీరోయిన్లు ఇద్దరూ స్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత సుశాంత్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా నిజానికి మార్చ్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని అనివార్యా కారణాల వలన విడుదల తేదీని వాయిదా వేసుకుంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే.

ట్వీట్..

Also read:

Nithiin: కళ్లు కనబడవు.. కానీ అతని వెనకాలే రక్తపు మరకలు.. ఆసక్తికరంగా నితిన్ ‘మాస్ట్రో’ ఫస్ట్‏లుక్ పోస్టర్…

NTR Trivikram Movie: ఎన్టీఆర్‌తో తలపడనున్న బాలీవుడ్‌ బడా హీరో..? అంత పెద్ద హీరో తెలుగులో విలన్‌గా నటిస్తాడా.?