NTR Trivikram Movie: ఎన్టీఆర్‌తో తలపడనున్న బాలీవుడ్‌ బడా హీరో..? అంత పెద్ద హీరో తెలుగులో విలన్‌గా నటిస్తాడా.?

NTR Trivikram Movie: ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన 'అరవింత సమేత వీర రాఘవ' ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాక్షనిజాన్ని సరికొత్త కోణంలో చూపించిన...

NTR Trivikram Movie: ఎన్టీఆర్‌తో తలపడనున్న బాలీవుడ్‌ బడా హీరో..? అంత పెద్ద హీరో తెలుగులో విలన్‌గా నటిస్తాడా.?
Ntr Trivikram Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 29, 2021 | 8:49 PM

NTR Trivikram Movie: ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింత సమేత వీర రాఘవ’ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాక్షనిజాన్ని సరికొత్త కోణంలో చూపించిన త్రివిక్రమ్‌ మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తన నటనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించి బయటకొస్తున్న వార్తలు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి.

Saif Alikhan

Saif Alikhan

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదే ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్రలో నటిస్తుండడం. సహజంగానే త్రివిక్రమ్‌ సినిమాలో విలన్‌ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే సైఫ్‌ అలీఖాన్‌ను తీసుకుంటే సినిమాకు ప్లస్‌ అవుతుందని భావిస్తున్నట్లు సమాచారం. అందులోనూ ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయొచ్చనేది దర్శకుడి ఆలోచన అని టాక్‌. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే సైఫ్‌ అలీఖాన్ ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆది పురుష్‌’ చిత్రంలో రావణుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ చిత్రానికి ప్రస్తుతం ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌గా ఉండగా… ‘అయినను పోయి రావలె హస్తినకు’, ‘చౌడప్ప నాయుడు’ వంటి పేర్లు వినిపిస్తు్న్నాయి. ఇక ఈ సినిమాలో హీరోగా రష్మిక, పూజా హేగ్డేల పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే త్రివిక్రమ్‌ సినిమా ప్రారంభంకానుంది.

Also Read: Rang De : పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న రంగ్ దే.. ఫస్ట్ వీక్ ఎంత వసూల్ చేసిందంటే..

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ.. స్వరరాజా ఇళయరాజా కలిసిన కిషన్ రెడ్డి

Vakeel Saab Trailer Review: వేరే లెవల్‌‌‌‌లో ‘వకీల్ సాబ్’ ట్రైలర్.. పూనకాలతో ఊగిపోతున్న అభిమానులు..