AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలనాటి సోగ్గాడితో విక్టరీ వెంకటేష్.. నవ్వులు చిందిస్తూ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..

Venkatesh with  Shobhan babu: ఒకప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ లేని సమయంలో కేవలం పెద్ద పెద్ద కెమెరాలు మాత్రమే అందుబాటులో ఉండేవి.

అలనాటి సోగ్గాడితో విక్టరీ వెంకటేష్.. నవ్వులు చిందిస్తూ.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్..
Venkatesh Shobhan Babu
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2021 | 6:26 AM

Share

Venkatesh with  Shobhan babu: ఒకప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ లేని సమయంలో కేవలం పెద్ద పెద్ద కెమెరాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇక కేవలం సినిమాలు మాత్రమే తెరపై అలరిస్తు ఉండేవి. ఇక వెండితెర నటీనటుల గురించి అభిమానులకు తెలిసేది కాదు. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగంలో నటీనటులు ఎప్పుడూ తమ అభిమానులకు టచ్‏లో ఉంటున్నారు. ఇటీవల అలనాటి హీరోలకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సమయంలోని ఫోటోలతోపాటు… స్టార్ నటీనటుల ఫోటోలను చూస్తునే ఉంటాం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ అందమైన త్రోబ్యాక్ ఫోటో వైరల్ అవుతుంది. వారేవరో కాదు… అలనాటి సోగ్గాడు శోభాన్ బాబు, విక్టరీ వెంకటేష్. అందులో ఇద్దరూ స్టార్ హీరోలు నవ్వులు చిందిస్తూ… షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో హ్యాండ్సమ్ హీరో శోభన్ బాబుకు అప్పట్లో మహిళా ఫాలోయింగ్ మాములుగా ఉండేది కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ హీరోలతో పాటు దశాబ్దాల కాలంపాటు వందల సినిమాలతో అలరించిన ఘనత శోభన్ బాబు దక్కించుకున్నారు. అటు నటన పరంగాను ఇటు వ్యక్తిత్వం పరంగాను శోభన్ బాబు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు సినీ అరంగేట్రం చేశారు. ఇక అదే సమయంలో ఓ ఫంక్షన్‏లో షేక్ హ్యాండ్ ఇస్తూ.. నవ్వులు చిందిస్తున్నారు శోభన్ బాబు, వెంకటేష్.. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు మళ్లీ ఆ సోగ్గాడు తమ కళ్ల ముందుకు వచ్చినట్లుందని అభిప్రాయపడుతున్నారు.

Also Read:

Chiranjeevi Acharya movie Laahe Laahe song : మెగా ఫ్యాన్స్ కోసం శాంపిల్ వదిలిన ఆచార్య, రేపిక బంపరాఫరే..

RRR Movie Update: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్‏ప్రైజ్ .. ఈసారి ఆ స్టార్ హీరో లుక్ రాబోతుందా ?

Extra Jabardasth: జబర్ధస్త్ షూటింగ్ సెట్‏లో టీమ్‏ లీడర్ల మధ్య గొడవ.. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వర్ష..