AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

April Bank Holidays: తెలుగు రాష్ట్రాల బ్యాంక్ వినియోదారులు బీ ఎలర్ట్.. ఏప్రిల్‌లో ఎన్నిరోజులు బ్యాంక్‌లకు సెలవులంటే..!

Bank Holidays In April 2021: మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెలలో కూడా పండుగలున్నాయి. దీంతో బ్యాంక్ వినియోగదారులు పనిదినాలను...

April Bank Holidays: తెలుగు రాష్ట్రాల బ్యాంక్ వినియోదారులు బీ ఎలర్ట్.. ఏప్రిల్‌లో ఎన్నిరోజులు బ్యాంక్‌లకు సెలవులంటే..!
Bank Holidays
Surya Kala
| Edited By: |

Updated on: Mar 31, 2021 | 12:01 PM

Share

Bank Holidays In April 2021: మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నెలలో కూడా పండుగలున్నాయి. దీంతో బ్యాంక్ వినియోగదారులు పనిదినాలను దృష్టిలో పెట్టుకుని పనుల షెడ్యూల్ ని రెడీ చేసుకోవాల్సి ఉంది. ఇక వారానికి నాలుగు రోజులు సెలవులు ఉండనే ఉంటాయి. దీంతో ఏప్రిల్ లో ఎవరికైనా ముఖ్యమైన బ్యాంక్ లావాదేవీలుంటే బీ అలెర్ట్.. ఎందుకంటే ఏప్రిల్ లో దాదాపు 12 రోజులు హాలీడేస్ రానున్నాయి. ఏప్రిల్ లో గుడ్ ఫ్రైడే, ఉగాది,ఎం శ్రీరామ నవమి పండుగలతో పాటు.. నేషనల్ హాలీడేస్ అయిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, అంబేద్కర్ జయంతిలు కూడా ఉన్నాయి. ఇక వీటితో పాటు ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాలు సెలవులు.. దీంతో ఇవన్నీ కలిసి ఏప్రిల్ లో మొత్తం 12 రోజులు బ్యాంక్ లు మూసివేసి ఉంటాయి. అయితే ఈ బ్యాంక్ పనిదినాలు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే సంబంధించినవి.. ఎందుకంటే బ్యాంక్ హాలిడేస్ రాష్ట్రానికి అనుగుణంగా మారతాయి.

ఏప్రిల్ లో నెలలో మొత్తం 30 రోజుల్లో 12 రోజులు బ్యాంక్ హాలీడేస్.. దీంతో ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది 18 రోజులే. కనుక ఎవరికైనా బ్యాంక్ లావాదేవీలు ఉంటె ఆ సెలవులకు అనుగుణంగా ముందే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి.

ఏప్రిల్ 1- బ్యాంకుల అకౌంటింగ్

ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 4- ఆదివారం

ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 10- రెండో శనివారం

ఏప్రిల్ 11- ఆదివారం

ఏప్రిల్ 13- ఉగాది

ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి

ఏప్రిల్ 18- ఆదివారం

ఏప్రిల్ 21- శ్రీరామనవమి

ఏప్రిల్ 24- నాలుగో శనివారం

ఏప్రిల్ 25- ఆదివారం.

ఏప్రిల్ 1(New Rules From April 1)న బ్యాంక్ అకౌంట్ క్లోజింగ్ కనుక ఆ రోజు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. వినియోగదారులు ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని ముందుగా తమ బ్యాంక్ లావాదేవీలను ప్లాన్ చేస్తుకోవాల్సి ఉంటుంది.

Also Read: కార్తీక్ నా చెప్పుడుమాటలు వినడానికి రాడా అని బాధపడుతున్న మోనిత.. దీప పిల్లల దగ్గరకు చేరుకున్న డాక్టర్ బాబు

అన్నం ఉడికిన తర్వాత గంజి పారబోస్తున్నారా..? ఈ ప్రయోజనాలు తెలిస్తే చుక్క కూడా వేస్ట్ చెయ్యరు 

మొసలిపై కూర్చుని నది దాటిన కోడి.. అంతలోనే అనూహ్య సంఘటన.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో.!

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..