Viral: మొసలిపై కూర్చుని నది దాటిన కోడి.. అంతలోనే అనూహ్య సంఘటన.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో.!
Viral Video: అసలే అదొక మొసలి.. ఒడ్డున ఆదమరిచి విశ్రాంతి తీసుకుంటోంది కదా.. అని గేమ్స్ ఆడితే ఇంకేమైనా ఉందా.! అంతే సంగతులు...
Viral Video: అసలే అదొక మొసలి.. ఒడ్డున ఆదమరిచి విశ్రాంతి తీసుకుంటోంది కదా.. అని గేమ్స్ ఆడితే ఇంకేమైనా ఉందా.! అంతే సంగతులు క్షణాల్లో దానికి ఆహారం అయిపోవాల్సిందే.. కానీ అవేం పట్టించుకోలేదు. మొసలి అయితే నాకేంటి అంటూ ఓ కోడి దానిపై దర్జాగా ఎక్కింది. అప్పుడే అనూహ్యమైన ట్విస్ట్.. దానిని ఎరగా చేసుకోవడానికి మరో మొసలి మాటున ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం..!
ఇందులో ఓ కోడి ఎంతో హాయిగా మొసలిపై కూర్చుని నదిని దాటుతున్నట్లుగా చూడవచ్చు. మొసలి ఏమరపాటుగా ఉంది కదా అనుకుని కోడి ఎంజాయ్ చేస్తోంది. కానీ అనూహ్యంగా కోడి ఒడ్డుకు చేరుకునేసరికి ఒక్కసారిగా మొసలి వేటాడడానికి ప్రయత్నించింది. అయితే కోడి మాత్రం ఎగురుతూ దాని నుంచి తప్పించుకుంది. అయితే ఇక్కడ అనుకోని అతిధిగా కోడిని మాటు వేయడానికి మరో మొసలి.. పక్కనే నీటి అడుగున ఉండటం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాన్షు కబ్రా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేయడంతో పాటు రీ-ట్వీట్లు చేస్తున్నారు.
Also Read:
చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!
మరణించాడనుకుని అంత్యక్రియలు పూర్తి.. మూడు నెలల తర్వాత తిరిగొచ్చిన చనిపోయిన వ్యక్తి.. ట్విస్ట్ ఇదే.!
2020 से 2021… फिर 2021 की शुरुआत…. बस ऐसी?है ?? pic.twitter.com/uqKNYyVROm
— Dipanshu Kabra (@ipskabra) March 26, 2021