చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి ఎన్నో రకాల అందమైన వీడియోలు తరచూ అప్‌లోడ్ అవుతుంటాయి. ఇంటర్నెట్‌లో జంతువుల కంటెంట్

  • Updated On - 4:22 pm, Mon, 29 March 21
చనిపోయినట్లుగా 'ముంగూస్' చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!
Mongoose

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి ఎన్నో రకాల అందమైన వీడియోలు తరచూ అప్‌లోడ్ అవుతుంటాయి. ఇంటర్నెట్‌లో జంతువుల కంటెంట్ బాగా వైరల్ అయ్యే కంటెంట్ అని చెప్పొచ్చు. అందులో కొన్ని వీడియోలు వినోదాత్మకంగా ఉండగా, మరికొన్ని భయానకంగా ఉంటాయి. ఇటీవల, ఒక ముంగూస్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎలాంటి సాహసం చేసిందో ఈ వీడియో ద్వారా చూడవచ్చు. దానిపై మీరూ ఓ లుక్కేయండి.!

తమకే అన్నీ భావోద్వేగాలు ఉన్నాయని మానవులు భావిస్తుంటారు. డ్రామాలు చేయడం కూడా తమకే తెలుసని వారి భావన. కానీ అది నిజం కాదు.. జంతువులు కూడా నాటకాలు ఆడతాయి. ఇది నిజమని ఈ వీడియో నిరూపిస్తుంది. ఇందులో హార్న్‌బిల్, ముంగూస్ మధ్య ఆసక్తికరమైన సీన్ జరిగింది. ముంగూస్ చేసిన పని చూసి మీరు ఖచ్చితంగా మీ చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటారు.

ఈ వీడియోను వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో, రెండు ముంగూస్‌లు హార్న్‌బిల్ వెనుక నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ ముంగూసలలో ఒకటి దాని దగ్గర వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. సడన్‌గా హార్న్‌బిల్ వెనక్కి తిరిగేసరికి, ముంగూస్ చనిపోయినట్లుగా నటిస్తుంది. ఇలా ఒక్కసారిగా కూడా ముంగూస్ చాలాసార్లు చేస్తుంది. హార్న్‌బిల్ తనపై దాడి చేయకూడదనే ఉద్దేశంతో ముంగూస్ ఇలా చనిపోయినట్లుగా నటిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈ ముంగూస్ ఎంత కొంటెగా, స్మార్ట్‌గా ఉందో చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

 ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!

 

View this post on Instagram

 

A post shared by wildlife 0.2 (@wildlife_0.2)