తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. మరోసారి పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

Special Trains Timing: తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తోన్న పలు ట్రైన్స్ సమయాల్లో...

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. మరోసారి పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!
Train
Ravi Kiran

|

Mar 27, 2021 | 1:31 PM


Special Trains Timing: తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తోన్న పలు ట్రైన్స్ సమయాల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు ఎస్‌సీఆర్ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని.. వీటిని ప్రయాణీకులు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.

టైమింగ్స్ మారిన లిస్టు ఇలా ఉంది…

  • కాకినాడ పోర్టు- చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌(07644) – తెనాలి, నిడబ్రోలు, బాపట్ల, చీరాల, వేటపాలెం, ఒంగోలు, సింగరాయకొండ, కావాలి, నెల్లూరు రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు జరిగింది.

  • నాగర్‌సోల్‌-నర్సాపూర్‌(02714) – విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు జరిగింది.

  • గుంటూరు-సికింద్రాబాద్‌(07201): గుంటూరు, పెదకాకాని, నంబూరు, మంగళగిరి, విజయవాడ, కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, బోనకాలు, ఖమ్మం, డోర్నకల్, గార్ల, మహబూబాబాద్, కేసముద్రం, నెక్కొండ, వరంగల్, కాజిపేట్ రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు జరిగింది.

  • లోకమాన్య తిలక్‌- కాకినాడ పోర్టు(07222): సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు జరిగింది.

  • పూరీ-తిరుపతి(07480)/ బిలాస్‌పూర్‌- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌(07482): గుడివాడ, విజయవాడ, తెనాలి, నిడుబ్రోలు, బాపట్ల, చీరాల, వేటపాలెం, అమ్మనబ్రోలు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, కావలి, బిట్రగుంట, నెల్లూరు రైల్వే స్టేషన్లకు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు జరిగింది.

  • విజయవాడ-విశాఖపట్నం(02718): అనకాపల్లి రైల్వే స్టేషన్‌కు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు జరిగింది.

  • విశాఖపట్నం-విజయవాడ(02717): విజయవాడ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు జరిగింది.

  • విజయవాడ-చెన్నై సెంట్రల్‌(02711): నెల్లూరు రైల్వే స్టేషన్‌కు సంబంధించిన టైమింగ్స్‌లో మార్పు జరిగింది.

  • అటు ‘హమ్ సఫర్ స్పెషల్ క్లోన్’ రైలును సైతం జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Also Read:

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!

హైదరాబాద్‌లో హోళీ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu