Holi 2021: హైదరాబాద్‌లో హోళీ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలే.!
Corona Effect On Holi: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ పోలీసులు హోళీ పండుగపై పలు ఆంక్షలు విధించారు...
Corona Effect On Holi: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ పోలీసులు హోళీ పండుగపై పలు ఆంక్షలు విధించారు. నగరంలో ఎలాంటి హోళీ ఈవెంట్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతోన్న నేపధ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నామని.. రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే గేటెడ్ కమ్యునీటిల వేడుకలపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఈ విషయంపై ఈవెంట్స్ ఆర్గనైజర్లకు, హాస్టళ్ల నిర్వహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ప్రజలందరూ ఇళ్లలోనే హోళీ వేడుకలు నిర్వహించుకోవాలని, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా పండుగ రోజు తిరగొద్దని సూచించారు.అటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు.
తెలంగాణలో కొత్తగా 495 పాజిటివ్ కేసులు….
తెలంగాణలో కరోనా మహమ్మారి కరాళనృత్యం మరోసారి మొదలైంది. గడిచిన 24 గంటల్లో 495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వైరస్ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అయితే, నిన్న ఒక్కరోజులో 247 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,870 బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 142 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులో తెలంగాణలో మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,804కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి ధాటికి తట్టుకోలేక మృతి చెందిన వారి సంఖ్య 1,685కు చేరింది. ఇదిలావుంటే, నిన్న ఒకే రోజు 58,029 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
Also Read:
ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!