మళ్లీ కలవరపెడుతున్న కరోనా.. కొత్తగా 495 మందికి పాజిటివ్.. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రత్యేక ఆంక్షలు

తెలంగాణలో కరోనా మహమ్మారి కరాళనృత్యం మరోసారి మొదలైంది. గడిచిన 24 గంటల్లో 495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

మళ్లీ కలవరపెడుతున్న కరోనా.. కొత్తగా 495 మందికి పాజిటివ్.. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రత్యేక ఆంక్షలు
Corona Cases Telangana
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 27, 2021 | 12:16 PM

Telangana coronavirus: తెలంగాణలో కరోనా మహమ్మారి కరాళనృత్యం మరోసారి మొదలైంది. గడిచిన 24 గంటల్లో 495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వైరస్‌ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అయితే, నిన్న ఒక్కరోజులో 247 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,241 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 1,870 బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 142 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులో తెలంగాణలో మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,804కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి ధాటికి తట్టుకోలేక మృతి చెందిన వారి సంఖ్య 1,685కు చేరింది. ఇదిలావుంటే, నిన్న ఒకే రోజు 58,029 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

Telangana Coronavirus Cases

Telangana Coronavirus Cases

కాగా, గత కొన్ని రోజులుగా కొత్త కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలను మూసివేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో మళ్లీ టెన్షన్ నెలకొంది. మళ్లీ లాక్‌డౌన్ పెడతారా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాస్క్‌లు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని చెప్పారు తెలంగాణ సీఎం. మరోవైపు, హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధించారు.

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు