మళ్ళీ లాక్ డౌన్ పరిష్కారం కాదు, కోవిడ్ తో సర్దుకుపోవాల్సిందే ! ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి

తిరిగి లాక్ డౌన్ విధించడమన్నది కరోనా వేవ్ సమస్యకు పరిష్కారం కాదని, ఈ వైరస్ తో జీవిస్తూ సర్దుకుపోవాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. నగరంలో వరుసగా రెండో రోజైన శుక్రవారం కూడా  కొత్తగా 1500...

మళ్ళీ లాక్ డౌన్  పరిష్కారం కాదు, కోవిడ్ తో సర్దుకుపోవాల్సిందే ! ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి
Lockdown Is Not The Solution For Coronavirus Says Delhi Health Minister
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 27, 2021 | 2:10 PM

తిరిగి లాక్ డౌన్ విధించడమన్నది కరోనా వేవ్ సమస్యకు పరిష్కారం కాదని, ఈ వైరస్ తో జీవిస్తూ సర్దుకుపోవాలని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. నగరంలో వరుసగా రెండో రోజైన శుక్రవారం కూడా  కొత్తగా 1500 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మాట్లాడిన ఆయన.. లోగడ  లాక్ డౌన్ విధించినా కరోనా బెడద తగ్గలేదని, అది తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభిస్తోందని అన్నారు. అంటే దీని కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదని నిరూపితమైందన్నారు. కరోనా వైరస్ లేదా వేరియంట్ అన్నది సంవత్సరాల తరబడి ఉంటుందని నిపుణులు హెచ్ఛరించారని, ఈ కారణంగా మనం అత్యంత జాగరూకతతో ఉంటే చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఎలా జీవించాలన్నది మనం నేర్చుకోవాలని గత ఏడాది సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన విషయాన్ని సత్యేంద్ర జైన్ గుర్తు చేశారు. లాక్ డౌన్ విధింపు సాధ్యం కాదు.. గతంలో దీని వెనుక ఓ లాజిక్ ఉండేది.. ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో ఎవరికీ తెలిసేది కాదు..21 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తే ఈ వ్యాప్తి ఆగిపోతుందని నమ్మాము. కానీ ఇది నశించలేదు ..అందువల్ల లాక్ డౌన్ ఈ సమస్యకు పరిష్కారం కాదని నేను భావిస్తున్నా’ అని ఆయన చెప్పారు.

ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని, మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటింపు వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సత్యేంద్ర జైన్ కోరారు. ఎంతమంది ఎక్కువగా మాస్కులు ధరిస్తే అంతగా ఈ వైరస్ ని అదుపు చేయవచ్చునని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉదయం  9 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు కూడా వ్యాక్సిన్ ఇస్తుంటారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ ఇచ్చే వేళలను  ఇలా తాము పొడగించినట్టు తెలిపారు. రోజురోజుకీ నగరంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న విషయాన్ని మరువరాదన్నారు. వ్యాక్సినేషన్ మూడో దశ కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. మరిన్ని చదవండి ఇక్కడ : బాతుపిల్లకు సాయంచేసిన మనసున్న మృగరాజు వీడియో.. ముచ్చట పడుతున్న నెటిజన్లు : Lion And Duck Video. పురోహితుల క్రికెట్ లీగ్‌ మీరు ఎప్పుడైనా చూశారా..!సిక్సర్లు,ఫోర్లతో దుమ్ములేచిన గ్రౌండ్ : Pandits Cricket League video.