AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.200 కోసం రూ. 6కోట్లు వదులుకుంది.. నిజాయితీని చాటుకున్న లాటరీ సెల్లర్..!

నేటి సమాజంలో ప్రతి బంధం ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ లాటరీ సెల్లర్ తన నిజాయితీని చాటుకున్నారు.

రూ.200 కోసం రూ. 6కోట్లు వదులుకుంది.. నిజాయితీని చాటుకున్న లాటరీ సెల్లర్..!
Kerala Lottery Seller Honesty
Balaraju Goud
|

Updated on: Mar 27, 2021 | 12:51 PM

Share

kerala lottery seller honesty: నేటి సమాజంలో ప్రతి బంధం ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ లాటరీ సెల్లర్ తన నిజాయితీని చాటుకున్నారు. ఒకటి కాదు రెండు ఆరు కోట్ల రూపాయల లాటరీని గెలుచుకున్న వారికి అందించి తన గొప్పతనాన్ని వ్యక్తం చేశారు. అదీకూడా ఫోన్ ద్వారా టికెట్ కొన్నవారికి లాటరీ డబ్బులు అందించారు. ఒక్క లాటరీ తగిలినా చాలు.. జీవితమే మారిపోతుందంటూ ఎంతోమంది తమ కష్టపడి సంపాదించిన డబ్బులతో లాటరీ టికెట్స్ కొంటూ ఉంటారు. కానీ లక్షల్లో ఒక్కరికి మాత్రమే లక్కీ లాటరీ వరిస్తుంది.

ఇదిలావుంటే, లాటరీ టికెట్స్ అమ్మేవాళ్ల జీవితం కూడా అంతంత మాత్రమే. టికెట్లు అమ్మగా వచ్చిన డబ్బులతో వారు బ్రతుకు బండి లాగిస్తుంటారు. ఇదే క్రమంలోనే కొచ్చికి చెందిన స్మిజా మోహన్ అనే లాటరీ సెల్లర్.. రూ.6 కోట్ల విన్నింగ్ లాటరీని కస్టమర్‌కు ఇచ్చేసి, తన నిజాయితీని చాటుకుంది. కాగా కస్టమర్‌ను మోసం చేయలేని ఆ యువతికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కొచ్చికి చెందిన స్మిజ.. లాటరీ టికెట్లు అమ్ముతూ జీవనోపాధి పొందుతోంది. ఈ క్రమంలో ఆమె దగ్గర ఓ 12 లాటరీ టికెట్లు మిగిలిపోగా వాటిని అమ్మేద్దామనే ఉద్దేశంతో.. లాటరీ టికెట్ కస్టమర్లతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులో ఆ టికెట్లను పోస్టు చేసింది. అయినా ఎవరూ ఇంట్రెస్ట్ చూపకపోవడంతో పాలచోటిల్‌కు చెందిన చంద్రన్ చెట్టన్ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. అయితే తన వద్ద డబ్బులు లేవని, లాటరీ టికెట్‌కు సంబంధించిన రూ.200 తర్వాత ఇస్తానని చెప్పడంతో సరేనని స్మిజ ఒప్పేసుకుంది. దీంతో చంద్రన్ తన లక్కీ నెంబర్లు చెప్పి, ఆ నెంబరుతో ఉన్న టికెట్‌ను కొన్నాడు.

అయితే, చంద్రన్ చెప్పిన నెంబర్లకే రూ. 6 కోట్ల విలువైన లక్కీ లాటరీ తగలడంతో స్మిజ ఈ విషయాన్ని చంద్రన్‌కు ఫోన్ చేసి చెప్పింది. టికెట్ ఇచ్చింది. కస్టమర్‌ను మోసం చేసే అవకాశమున్నా, కడు పేదరికంలో ఉన్నా.. స్మిజ తన నిజాయితీని చాటుకుంది. తన భర్తతో కలిసి చంద్రన్ ఇంటికి వెళ్లి లాటరీ సొమ్ము అప్పగించి, తనకు రావల్సిన టికెట్ డబ్బులు రూ.200 తీసుకుని వెళ్లిపోయింది. స్థానికి ప్రెస్‌‌లో పనిచేసిన స్మిజ.. ప్రెస్‌లో ఉద్యోగాలు పోవడంతో 2011లో లాటరీ టికెట్ల విక్రయాన్నే ఉపాధిగా మలచుకుంది. స్మిజ నిజాయితీ తెలుసుకున్న నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. Read Also.. Centauri Honey: ఖరీదుతో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న తేనె .. కిలో 8లక్షల పైమాటే.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..?