Centauri Honey: ఖరీదుతో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న తేనె .. కిలో 8లక్షల పైమాటే.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..?

ప్రక‌ృతి మనిషికి ఇచ్చిన ఓ బహుమతి తేనె. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది..  బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో..! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. మన ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు...

Centauri Honey:  ఖరీదుతో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్న తేనె .. కిలో 8లక్షల పైమాటే.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..?
Centauri Honey
Follow us

|

Updated on: Mar 27, 2021 | 12:45 PM

Centauri Honey:  ప్రక‌ృతి మనిషికి ఇచ్చిన ఓ బహుమతి తేనె. బహుశా ఎలాంటి కల్తీకి లోనుకానిది..  బలవర్ధక ఆహారం కూడా ఇదేనేమో..! స్వచ్ఛమైన తేనె ఆరోగ్య ప్రదాయిని. మన ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది. ఒకప్పుడు అడవుల్లో మాత్రం లభించే ఈ తేనె ఇప్పుడు పట్టణాల్లో అదీ ఇళ్ల పెరడులో కూడా తయారవుతోంది. ఇలా కృత్రిమంగా జరిగే ఈ తేనెటీగల పెంపకం, తేనె సేకరణ వల్ల తేనెపట్టుల్లో లభించే తేనె ప్రమాణం క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఇక అడవుల్లో లభించే తేనె సంగతి సరేసరి. ఇప్పటికే సగానికి క్షీణించిన ఈ అడవి తేనె మరి కొన్ని సంవత్సరాలు గడిస్తే కనుమరుగే అవుతుందేమోననే భయాన్ని ప్రకృతి ప్రేమికులు వ్యక్తం చేస్తున్నారు. తేనె వాడకం ఈ నాటిది కాదు. అనాదినుంచి కూడా వాడుకలో ఉంది. అయితే స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది బ్యాక్టీరియాని చంపే స్తుంది. పంచదార కనిపెట్టకముందు మనిషి తొలిసారిగా తీపి రుచిని తెలుసుకుంది దీని ద్వారానే. మొట్టమొదటగా మద్యాన్ని తయారుచేసిందీ తేనెతోనే.

ఎన్నో ప్రయోజనాలున్న తేనెను కొన్ని కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టాయి కూడా.. అయితే ఒక కంపెనీ తమ కంపెనీ తేనె ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన తేనె అని చెబుతుంది. ఈ విషయాన్నీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ధృవీకరించింది. వివరాల్లోకి వెళ్తే..

టర్కీకి చెందిన సెంటౌరీ హనీ ప్రత్యేకంగా ఈ తేనెను సేకరిస్తోంది. ఈ తేనె కిలో ధర రూ.8,60,000అట. అంతేకాదు ఈ తేనెను ఏడాది లో ఒక్కసారి మాత్రమే తీసారట. ఈ తేనెకు సంబంధించిన పూర్తి వివరాలను గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అధికారిక వెబ్‌సైట్లో ప్రకటించింది.

అయితే తమ తేనె రెగ్యులర్ గా మార్కెట్ లో దొరికే తేనె కంటే భిన్నంగా ఉంటుందని సెంటౌరీ సంస్థ చెబుతోంది. జనసంచారం లేని చోట.. సముద్ర మట్టానికి 2,500 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక గుహలో తేనెటీగల పెంపకాన్ని చేపడుతుంది. గుహల చుట్టుపక్కల పెరిగే ఔషధ మొక్కల నుంచి తేనెటీగలు పుప్పొడిని సేకరిస్తాయి.అందుకని ఇక్కడ ఉత్పత్తి అయ్యే తేనెలో మెగ్నీషియం, పొటాషియం, ఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ తేనె తీపి కంటే చేదుగా ఉండడం విశేషం. ఇది ముదురు రంగులో ఉంటుంది మరియు వివిధ ఔషధాలతో నిండి ఉంటుంది. అలాగే, ఈ తేనెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పండిస్తారు. అయితే ఆ సంస్థ.. తేనె ను తియ్యడం కోసం ఉపయోగించే పడతులన్నీ ఇప్పటికీ రహస్యంగానే ఉంచుతుంది. గిన్నిస్ బుక్ లో ఎక్కి రికార్డ్ సాధించిన సందర్భంలో వారి విజయాన్ని ఓ వీడియో ద్వారా ఆ కంపెనీ పంచుకుంది.

Also Read : బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. చివరి తేదీ ఎప్పుడు.. ఎలా అప్లై చేసుకోవాలంటే

Latest Articles
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
వామ్మో.. ఇదేం ఊచకోత భయ్యా.. 17 సీజన్లలో తొలిసారి ఇలా..
వామ్మో.. ఇదేం ఊచకోత భయ్యా.. 17 సీజన్లలో తొలిసారి ఇలా..
ఈ చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు అందాల వయ్యారి..
ఈ చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు అందాల వయ్యారి..
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయా? అసలు కారణం ఏంటి?
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయా? అసలు కారణం ఏంటి?