AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam Election 2021 Phase 1 Voting Highlights: అస్సాంలో ముగిసిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌.. 6 గంటల వరకు ఎంత పోలింగ్‌ నమోదైందంటే..

Assam Election 2021: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అస్సాం అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. 47 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఎన్నికల సంఘం ప్రకారం..  సాయంత్రం 6 గంటల వరకు..

Assam Election 2021 Phase 1 Voting Highlights: అస్సాంలో ముగిసిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌.. 6 గంటల వరకు ఎంత పోలింగ్‌ నమోదైందంటే..
Assam Elections 2021
Narender Vaitla
| Edited By: Subhash Goud|

Updated on: Mar 27, 2021 | 8:45 PM

Share

Assam Election 2021: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న అస్సాం అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. 47 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఎన్నికల సంఘం ప్రకారం..  సాయంత్రం 6 గంటల వరకు 72.14  శాతం  పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే పోలింగ్‌ సమయం ముగిసినా.. క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు ఎన్నికల అధికారులు. కోవిడ్‌–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో.. అన్ని భద్రతా చర్యల నడుమ పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రతీ పోలింగ్‌ కేంద్రం దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు. పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి.

బరిలో ఉన్న ప్రముఖులు..

అస్సాంలో తొలి దశలోనే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎందరో విపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్‌ మజూలి నుంచి తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ నేత రజీబ్‌ లోచన్‌ పెగు ఈ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సోనోవాల్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి మళ్లీ వీళ్లిద్దరే తలపడుతున్నారు. జోర్హత్‌ నుంచి అసెంబ్లీ స్పీకర్‌ హితేంద్రనాథ్‌ పోటీ పడుతున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Mar 2021 08:45 PM (IST)

    ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్‌

    అసోం రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేసేందుకు క్యూలైన్‌లో ఉన్నవారిని సాయంత్రం ఆరు గంటల వరకు ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. 47 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 72.14  శాతం  పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.కోవిడ్‌–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో.. అన్ని భద్రతా చర్యల నడుమ పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రతీ పోలింగ్‌ కేంద్రం దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు.

  • 27 Mar 2021 07:22 PM (IST)

    సాయంత్రం 6 గంటల వరకు 72.14 శాతం పోలింగ్‌

    అసోంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అయితే సాయంత్రం వరకే ముగియగా, క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు ఎన్నికల అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు 72.14 శాతం పోలింగ్‌ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

  • 27 Mar 2021 06:08 PM (IST)

    ముగిసిన పోలింగ్‌

    అసోంలో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.

  • 27 Mar 2021 05:54 PM (IST)

    సాయంత్రం 5 గంటల వరకు 71.62 శాతం పోలింగ్‌

    అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 71.62 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

  • 27 Mar 2021 05:24 PM (IST)

    ప‌శ్చిమ‌బెంగాల్‌లో 70.17 శాతం పోలింగ్

    ప‌శ్చిమ‌బెంగాల్‌లో 70.17 శాతం పోలింగ్ న‌మోదైంద‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించింది. ప‌శ్చిమ‌బెంగాల్ ఇంకా తొలి విడుత పోలింగ్ కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌ నుంచి పోలింగ్‌ ప్రారంభ‌మైంది.

  • 27 Mar 2021 04:50 PM (IST)

    4 గంటల వరకు 62.36 శాతం పోలింగ్‌

    అసోంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 62.36 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

  • 27 Mar 2021 03:29 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు 47.10 శాతం పోలింగ్‌

    అసోంలో 12 జిల్లాల్లో 47 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు 47.10 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తొలి విడతలో 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

  • 27 Mar 2021 02:36 PM (IST)

    ప్రశాంతంగా కొనసాగుతోన్న అస్సాం ఎన్నికల పోలింగ్‌.. మధ్యాహ్నం రెండు గంటల వరకు..

    అస్సాం అసెంబ్లీకి జరుగుతోన్న తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం రెండు గంటల వరకు 45.24 శాతం పోలింగ్‌ పూర్తయిన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొదట దశలో భాగంగా జరుగుతోన్న పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

  • 27 Mar 2021 01:24 PM (IST)

    ప్రశాంతంగా కొనసాగుతోన్న అస్సాం ఎన్నికల పోలింగ్‌.. ఒంటి గంట వరకు ఎంత పోలింగ్‌..

    అస్సాం అసెంబ్లీకి జరుగుతోన్న తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రముఖులు ఒక్కొక్కరుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు అస్సాంలో 37.06 శాతం ఓటింగ్‌ జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

  • 27 Mar 2021 11:55 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్‌ నేత గోగోయ్‌..

    అస్సాంలో జరుగుతోన్న తొలి దశ ఎన్నికల్లో ఓటింగ్‌ హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్‌ నాయకుడు గౌరవ్‌ గొగోయ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన గొగోయ్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన సమయం. చాలా ఏళ్ల తర్వాత నేను నా తల్లిదండ్రులు లేకుండా పోలింగ్‌ బూత్‌కు వచ్చాను. ప్రజలు అబద్ధాలు, నిజాయితీ లేని రాజకీయాలకు దూరంగా ఉంటూ.. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం పనిచేసే నాయకుడికి ఓటు వేస్తారనే నమ్మకం నాకు ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.

  • 27 Mar 2021 11:36 AM (IST)

    అస్సాంలో కొనసాగుతోన్న పోలింగ్‌.. 11 గంటల వరకు ఎంత ఓటింగ్‌ జరిందంటే..

    దేశం దృష్టిని ఆకర్షిస్తోన్న అస్సాం అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 24.48 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. మొదటి దశలో భాగంగా జరుగుతోన్న ఈ ఓటింగ్‌ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది.

  • 27 Mar 2021 11:18 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి..

    అస్సాం అసెంబ్లీకి జరుగుతోన్న తొలి దశ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వానంత సోనోవాల్ మజూలి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిబ్రూగర్‌లోని పోలింగ్ బూత్‌లో ముఖ్యమంత్రి ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మేము వందకుపైగా సీట్లను గెలుచుకోబోతున్నాం’ అని వ్యాఖ్యానించారు.

  • 27 Mar 2021 11:01 AM (IST)

    ఓటర్లకు పిలుపునిచ్చిన ప్రియాంక గాంధీ..

    కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అస్సాం ఎన్నికల నేపథ్యంలో మాట్లాడారు. అస్సాం ప్రజలు రాష్ట్ర అభివృద్ధి, తమ బంగారు భవిష్యత్తు కోసం ఓటు వేయాలని ప్రియాంక గాంధీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

  • 27 Mar 2021 10:58 AM (IST)

    పటిష్ట భద్రతా నడుమ కొనసాగుతోన్న అస్సాం ఎన్నికలు..

    దేశం దృష్టిని ఆకర్షిస్తున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాతంగా కొనసాగుతోంది. తొలి దశలో ఇవాళ 47 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి దశ పోలింగ్‌ జరగనున్న స్థానాల్లో 81.09 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే పటిష్ట భ్రదతా నడుమ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.

  • 27 Mar 2021 10:04 AM (IST)

    అస్సాంలో కొనసాగుతోన్న తొలి దశ పోలింగ్‌.. ఉదయం 9 గంటల వరకు.

    అస్సాంలో తొలి దశ అసెంబ్లీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్‌ స్టేషన్ల వద్ద క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఉదయం 9 గంటల వరకు మొత్తం 8.84 శాతం ఓటింగ్‌ జరిగినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదిలా ఉంటే మొదటి దశలో ఈ రోజు రాష్ట్రంలోని 47 స్థానాల్లో ఓటింగ్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే.

  • 27 Mar 2021 08:49 AM (IST)

    సామాజిక దూరాన్ని తూచా తప్పక పాటిస్తోన్న ఓటర్లు..

    కరోనా మహమ్మారి పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే మజులిలోని కమలా బారి జూనియర్‌ స్కూల్‌లో ఏర్పాట్లపై ఓ లుక్కేయండి. ఇదిలా ఉంటే అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ఈ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన గతంలోనూ ఇదే స్థానం నుంచి పోటీకి దిగారు.

  • 27 Mar 2021 08:27 AM (IST)

    ప్రజాస్వామ్యం పవిత్ర ఉత్సవంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలి: జెపి నడ్డా

    అస్సాం అసెంబ్లీ మొదటి దశ పోలింగ్‌లో పెద్ద ఎత్తున జనాలు పాల్గొనాలని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పవిత్ర ఉత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన అన్నారు. ఓటింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాలని ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కోరారు. ఇక పోలింగ్ స్టేషన్లకు వచ్చే ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని సూచించారు. జెపి నడ్డా ఈ విషయాన్ని బెంగాళీ భాషలో ట్వీట్ చేయడం విశేషం.

  • 27 Mar 2021 07:48 AM (IST)

    పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు..

    ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. నాగాన్‌ జిల్లాలోని రూపహి పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు బారులు తీరారు. విధులకు వెళ్లే ముందు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తోంది.

  • 27 Mar 2021 07:44 AM (IST)

    ప్రజాస్వామ్య మూలాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: మన్మోహన్‌ సింగ్‌

    ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘ప్రజాస్వామ్య మూలాలను కాపాడుకోవాల్సిన బాధ్య అందరిపై ఉందని. దీనికి ఉత్తమమైన మార్గం ఓటు వేయడమే’ అంటూ ట్వీట్‌ చేశారు.

  • 27 Mar 2021 07:37 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి..

    అస్సాం తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ‘అస్సాం తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైంది. అర్హత ఉన్న ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోండి. ముఖ్యంగా యువ ఓటర్లు ఎంతో విలువైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి’ అంటూ ట్వీట్‌ చేశారు.

  • 27 Mar 2021 07:33 AM (IST)

    ఫేస్‌ షీల్డ్స్‌తో హాజరైన ఎన్నికల సిబ్బంది..

    అస్సాం అసెంబ్లీ మొదటి దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఫేస్‌ ఫీల్డ్స్‌ వేసుకొని విధులకు హాజరయ్యారు. ఇక 47 స్థానాలకు పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే.

Published On - Mar 27,2021 8:45 PM