జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీకి మరోసారి గుర్తింపు.. మూడు విభాగాలలో అవార్డులు సొంతం
హైదరాబాద్ గ్రీన్ & క్లీన్ సిటీ, స్మార్ట్ వేస్ట్ డిస్పోజల్ ప్రాజెక్ట్, స్టార్ట్-అప్ అవార్డు అనే మూడు విభాగాలలో అవార్డులను సొంతం చేసుకుంది.
National award for ghmc: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. హైదరాబాద్ గ్రీన్ & క్లీన్ సిటీ, స్మార్ట్ వేస్ట్ డిస్పోజల్ ప్రాజెక్ట్, స్టార్ట్-అప్ అవార్డు అనే మూడు విభాగాలలో అవార్డులను సొంతం చేసుకుంది.
కూకట్‌పల్లి, యూసుఫ్‌గుడా నాలాస్ కూడలి వద్ద, బేగంపే ఫ్లైఓవర్ కింద హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన బేగుంపెట్‌లోని రెయిన్ గార్డెన్ మొదటి విభాగంలో అవార్డును గెలుచుకోగా, రెండవ విభాగంలో పూర్తి యాంత్రిక ద్వితీయ సేకరణ , రవాణా పాయింట్ల నెట్‌వర్క్ విభాగంలో అవార్డు లభించింది.
వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్వహణలో సాంకేతిక విధానాలు అవలంబిస్తోన్న జీహెచ్‌ఎంసీకి జాతీయ స్థాయిలో పురస్కారం దక్కింది. సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహితమైన సెకండరీ ట్రాన్స్ పోర్ట్, అండ్ కలెక్షన్ పాయింట్స్ (ఎస్‌సీటీపీ) ఏర్పాటు, కంపాక్ట్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినందుకు స్మార్ట్ వేస్ట్ డిస్పో జబుల్ ప్రాజెక్టు అవార్డు దక్కింది. ఆటోమేటేడ్ విధానంలో పనిచేసే ఎస్‌టీ పీలు, స్మార్ట్ కంపాక్టర్‌ల ఏర్పాటు దేశంలోనే మొదటిసారని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. అవార్డు రావడంపై సంస్థ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మూడవ విభాగంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు చేపట్టిన WE HUB కు అవార్డు లభించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎమ్‌శాంతోష్, అదనపు కమిషనర్, జిహెచ్‌ఎంసి, బి.శాంతోష్ తదితరులు శుక్రవారం అవార్డులు అందుకున్నారు.
ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఎగ్జిబిషన్స్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఎక్స్‌పో నిర్వహించింది. ఢిల్లీలో జరిగిన 28వ స్మార్ట్ సిటీస్ ఎక్స్‌పో ముగింపు సందర్భంగా జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ బదావత్ సంతోష్ శుక్రవారం అవార్డు అందుకున్నారు.
ఇదీ చదవండిః Anantapur Crime : ప్రాణం తీసిన పసరు మందు.. మద్యం వ్యసనం నుంచి తప్పించుకోబోయి.. కానరాని లోకాలకు..