King Cobra: ఈ పాముకి సిగ్గు ఎక్కువ.. గుడ్లు పెట్టడానికి గూడు కట్టే ఏకైక పాము.. తేడా వస్తే అంతు చూస్తుంది అంతే…!

King Cobra: పాముల్లో అనేక రకాలు.. అయితే ఒక పాము మాత్రం మనిషి ను చూస్తే సిగ్గుపడుతుంది.. అయితే ఇది ప్రపంచములో అత్యంత పెద్ద, పొడవైన విష సర్పాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది. అదే నల్లత్రాచు లేదా రాచనాగు..

King Cobra: ఈ పాముకి సిగ్గు ఎక్కువ.. గుడ్లు పెట్టడానికి గూడు కట్టే ఏకైక పాము.. తేడా వస్తే అంతు చూస్తుంది అంతే...!
King Cobra
Follow us

|

Updated on: Jul 17, 2021 | 12:05 PM

King Cobra: పాముల్లో అనేక రకాలు.. అయితే ఒక పాము మాత్రం మనిషి ను చూస్తే సిగ్గుపడుతుంది.. అయితే ఇది ప్రపంచములో అత్యంత పెద్ద, పొడవైన విష సర్పాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుంది. అదే నల్లత్రాచు లేదా రాచనాగు లేదా కింగ్ కోబ్రా అని అంటారు. ఇది 18 అడుగుల పొడవు. భారీ శరీరం. నల్లగా ఉంటుంది. చూడడానికే భయం పుడుతుంది. పడగెత్తిందంటే దాదాపు ఆరు అడుగులు పైకి లేస్తుంది. ఎదురుగా ఉన్న మనిషి కళ్లల్లోకి ఉగ్రరూపంతో చూస్తుంది. ఆ సీన్ ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది.. ఆ పాము ఎదురుగా కనిపిస్తే ఇంకెలా ఉంటుంది? అడవుల్లో నివసించే కింగ్ కోబ్రా కొన్ని కొన్ని సార్లు జనావాసాల్లోకి వచ్చి హల్ చల్ చేస్తాయి. అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన నల్లత్రాచును చూస్తే ఇక ఎక్కడివారు అక్కడే పరార్.

ఎంత దూరం వెళ్లినా కింగ్ కోబ్రా గురించి ఆలోచిస్తే.. ఎవరికైనా చెమటలు పడతాయి. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు తీస్తుంది అది. కింగ్ కోబ్రా సాధారణంగా 18.5 అడుగుల మేర పెరుగుతుంది. దాదాపు 8 కేజీల వరకు బరువుంటుంది. సుమారు 20 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఒక్కసారి కాటేసిందంటే.. మెదడుపై అత్యంత వేగంగా ప్రభావం చూపించి ప్రాణాలు తీస్తుంది. నిజానికి ఈ పాముకు సిగ్గెక్కువ. ఎవరికీ ఎదురెళ్లడానికి ఇష్టపడదు. కాని ఒక్కసారి తేడా వస్తే.. ప్రాణాలు తీసేవరకు వదలదు.

కింగ్ కోబ్రా తన పొడవులో దాదాపు మూడోవంతు వరకు పడగెత్తుతుంది. ఎవరినైనా టార్గెట్ చేస్తే అంతెత్తున లేచి బుస కొడుతుంది. ఇవి మనదేశంతో పాటు దక్షిణచైనా, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఆగ్నేయాసియా దేశాల్లో బాగా దట్టంగా ఉండే అడవుల్లో ఉంటాయి. కింగ్ కోబ్రాకు ఈత బాగా వచ్చు. అందుకే చెరువులు, చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తుంది. మిగిలిన పాములకు దీనికి ఓ తేడా ఉంది. గుడ్లు పొదగడానికి గూడు కట్టే ఏకైక పాము ఇదే.

కింగ్ కోబ్రా.. తన నాలుక ద్వారా 100 మీటర్ల దూరంలో ఉన్న ఆహారాన్ని కూడా పసిగడుతుంది. ఇతర పాముల్ని, ఎక్కువగా విషం లేని పాముల్ని తినడానికి బాగా ఇష్టపడుతుంది. ఆహారం కోసం పగటిపూట వేటాడే ఈ పాము.. ఒక్కసారి ఫుల్ గా తింటే.. నెలలపాటు ఆహారం లేకుండా ఉండగలదు. ముంగిసను చూస్తే దీనికి భయమెక్కువ. అది ఎదురొస్తే పారిపోతుంది. ఒకవేళ ఆ ఛాన్స్ లేకపోతే.. బుస కొట్టి భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కింగ్ కోబ్రా ఒక్కసారి కాటేస్తే.. దాని విషానికి ఓ పెద్ద ఆసియన్ ఏనుగునైనా చంపేంత శక్తి ఉంటుంది.

ఇక మనిషి ని కింగ్ కోబ్రా కాటు వేస్తె,, ఆ విష ప్రభావం శరీరంలోని నాడీ వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ విష ప్రభావం వలన దేహమంతా తీవ్రమైన నొప్పి, మసక బారిన దృష్టి, తల తిరగడం, మగత, పక్షవాతం కలుగుతాయి. తరువాత కొన్ని నిముషాలలోనే గుండెకు రక్త సరఫరా మందగిస్తుంది. దీనివలన కాటు తగిలిన జీవి కొద్ది సేపటికే స్పృహ కోల్పోతుంది. శ్వాస తీసుకోవడం బాగా కష్టమవడం వల్ల త్వరగా మరణం సంభవిస్తుంది. ప్రస్తుతానికి రెండు కంపెనీలు కింగ్ కోబ్రా విషానికి విరుగుడు తయారు చేస్తున్నాయి. మొదటిది థాయ్‌లాండ్ లోని రెడ్ క్రాస్ సంస్థ, రెండవది సెంట్రల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇండియా. ఈ రెండు కంపెనీలు తక్కువగా ఉత్పత్తి చేయడం వలన ఈ మందులు అంత విస్తారంగా దొరకవు.

Also Read: ఏపీలో తాజా కరోనా బులిటెన్ విడుదల.. ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

ఒక స్త్రీ వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చో తెలుసా..? వారసత్వ నగలకు లెక్కలు ఎలా చూపాలంటే.?

Latest Articles