Gold Ornaments: ఒక స్త్రీ వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చో తెలుసా..? వారసత్వ నగలకు లెక్కలు ఎలా చూపాలంటే.?
భారత దేశంలో బంగారానికి మహిళలకు అవినవభావ సంబంధం ఉంది. మహిళలకు బంగారం మీద ఉండే మోజు వర్ణింపనలవి కాదు. మన సంస్కృతిలో బంగారాన్ని సంపదకు, హోదాకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారం...
Gold Ornaments: భారత దేశంలో బంగారానికి మహిళలకు అవినవభావ సంబంధం ఉంది. మహిళలకు బంగారం మీద ఉండే మోజు వర్ణింపనలవి కాదు. మన సంస్కృతిలో బంగారాన్ని సంపదకు, హోదాకు చిహ్నంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు బంగారం ధరించడానికి ఆసక్తి కనబరుస్తారు. వివాహ సందర్భంగా బంగారం నగలు కొనడం భారత్ లో పరిపాటి. ఇక భారత్ లో బంగారం నగదుతో సమానంగా చలామణి అవుతుంది. కష్టకాలంలో బంగారం విక్రయించుకుంటే తక్షణమే నగదు చేతికొస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. నల్లధనం నిల్వ చేయడానికి బంగారం అనువైన మార్గంగా భావిస్తారు. అయితే మనదేశంలోని కొన్ని సంస్థల్లోని బంగారం నిల్వలు.. కొన్ని దేశాల్లో ఉండే బంగారం నిల్వలతో సమానమని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం బంగారం పై కొత్త నిబంధనలను తీసుకుని వస్తుంది.. దీంతో చాలా మందిలో ఎంతవరకూ బంగారం నిల్వ ఉంచుకోవచ్చు అన్న అనుమానం తలెత్తుతుంది. ఈ రోజు ఆ వివరాలను తెలుసుకుందాం..! నిజానికి మీ వద్ద ఉన్న బంగారం గురించి కరెక్ట్ గా చెప్పగలిగితే అప్పుడు ఎంత బంగారమైన ఉంచుకోవచ్చు. మీ వద్ద ఉన్న పసిడికి చట్టబద్ధమైన లెక్కలు చెప్పగలితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టాక్స్ కన్సల్టెంట్స్ నిపుణుల అభిప్రాయం.
బంగారం పరిమితి
పెళ్లి అయిన మహిళలు 500 గ్రాముల బంగారం వరకు ఉంచుకోవచ్చు. అదే సమయంలో పెళ్లి కానీ స్త్రీ వద్ద 250 గ్రాముల బంగారం ఉంచుకునే వీలుంది. ఇక మనిషి 100 గ్రాముల చొప్పున బంగారం ఉంచుకునే వీలుంది. అయితే పన్నులు చెల్లించిన డబ్బుతో బంగారం కొనుగోలు చేస్తే అప్పుడు ఆ ఆభరణాలకు పరిమితి ఉండదు. ఇక తరతరాలుగా వారసత్వంగా వస్తున్నా బంగారం పై కూడా పరిమితి లేదు.. అయితే అది వారసత్వంగా వచ్చింది అని నిరూపించుకోవాల్సి ఉంది. అలా చేయలేని పక్షంలో ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్ట ప్రకారం స్వాధీనం చేసుకోవచ్చు.
ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 132 ప్రకారం ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించిన ఎడల మీ వద్ద ఉన్న బంగారానికి తగిన ఆధారాలు చూపించకపోతే..వాటిని అధికారులు స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. ఇక బ్యాంక్ లో లేదా ఇంట్లో ఉన్న బంగారాన్ని అధికారులు తనిఖీ చేస్తే దానిని సవాల్ చేసే అధికారం పన్ను చెల్లింపుదారునికి ఉంది.
ఈ మేరకు 1 డిసెంబర్ 2016 న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దానిలో పెట్టుబడి లేదా వారసత్వంగా వచ్చిన బంగారంకు వారసత్వ మూలాన్ని చూపిస్తే… ఆ బంగారు ఆభరణాలను పట్టుకోవడానికి .. వీలు లేదని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన ఒక్క బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక బంగారు నాణేలు, బంగారు కడ్డీలు, వజ్రాలు లేదా ఇతర ఆభరణాలకు వర్తించదు.
బంగారం వారసత్వం వస్తే.. బహుమతి దస్తావేజు లేదా.. రసీదు భద్రపరచుకోవాలి. ఒకవేళ అటువంటి రసీదులు ఏమీలేకపోతే మీకు ఆ బంగారం వారసత్వంగా వచ్చింది అని చెప్పడానికి సరైన వాదన.. కుటుంబ వీలునామా ఉంటె వాటిని కూడా అధికారులు పరిగణలోకి తీసుకుంటారు.. ఇక ఇప్పటికే పాత, కొత్త బంగారానికి హల్ మార్క్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే..!
Also Read: వేసవిలో శరీరాన్ని చల్లబరిచే సొంపు డ్రింక్ తయారీ .. ఈ డ్రింక్ తో ప్రయోజనాలు తెలిస్తే వదలరుగా..!