A Place of Mysteries: ప్రపంచంలోనే ఈ బీచ్ వెరీ స్పెషల్.. రోజుకు రెండు గంటలు మాయం.. అప్పుడు ముత్యాలు లభ్యం ఎక్కడంటే..!

Hide and Seek Beach: పిల్లలు ఆడుకునే ఆటల్లో ఒకటి హైడ్ అండ్ సీక్.. మరి అదే ఆటను ప్రకృతి చేసే మాయాజాలంతో సముద్రం ఆడితే.. ఊహించడానికే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది.. దాగుడుమూతలు ఆడే ఒక బీచ్..

A Place of Mysteries: ప్రపంచంలోనే ఈ బీచ్ వెరీ స్పెషల్.. రోజుకు రెండు గంటలు మాయం.. అప్పుడు ముత్యాలు లభ్యం ఎక్కడంటే..!
Hide And Seek Beach
Follow us

|

Updated on: Mar 29, 2021 | 2:55 PM

Hide and Seek Beach: పిల్లలు ఆడుకునే ఆటల్లో ఒకటి హైడ్ అండ్ సీక్.. మరి అదే ఆటను ప్రకృతి చేసే మాయాజాలంతో సముద్రం ఆడితే.. ఊహించడానికే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది.. దాగుడుమూతలు ఆడే ఒక బీచ్ ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అవును ఆ హైడ్ అండ్ సీక్ బీచ్ మనదేశంలోనే ఉంది. ఈ బీజ్ రోజుకి రెండు సార్లు కనుమరుగువుతుంది. అవును నిజంగా సముద్రం రోజు కు రెండు సార్లు కొంచెం సేపు కనుమరుగవుతుంది. తక్కువ, ఎక్కువ అలల వ్యత్యాసంతో ఈ బీచ్ ప్రసిద్ధి చెందింది. ఆసక్తిని కాగిలించే ఈ బీచ్ ఎక్కడ ఉంది.. ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం..!

ప్రపంచంలోనే స్థానాన్ని మార్చే ఏకైక బీచ్ ఒడిశాలో ఉంది. ఇక్కడ ప్రముఖ క్షేత్రాలైన పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ దేవాలయాలకు వెళ్లిన భక్తులు పర్యాటకులు ఈ బీచ్ ను సందర్శిస్తారు.

ఒడిశా లో చండిపుర సముద్ర తీరం‌కు ‘హైడ్‌ అండ్‌ సీక్‌ బీచ్‌’ అని పేరు. ప్రకృతి చేసే మాయాజాలం వల్ల బీచ్‌కు ఆ పేరు వచ్చింది. ఈ సముద్ర తీరాన ఎత్తైన అలలు, ప్రకృతిని అలా చూస్తుండి పోవాల్సిందే. ఇక్కడి అలలు సుమారు 2-3 కిలోమీటర్ల పైకి వరకు వస్తాయి. ఆ తర్వాత ఒక్కసారిగా పల్లంగా మారిపోతుంటాయి. ఇలాంటి విచిత్రమైన దృశ్యాన్ని ప్రతిరోజు రెండు సార్లు చూడవచ్చు.

దీంతో ఈ బీచ్‌ను చూసేందుకు పర్యాటకులు తాకిడి ఎక్కువే ఉంటుంది. దేశ, విదేశాల నుంచి హైడ్ అండ్ సీక్ బీచ్‌ను చూసేందుకు తండోపతండాలు తరలి వస్తుంటారు. ఈ బీచ్‌లో జరిగే వింతలు చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదని సందర్శకులు సంతోషంతో చెబుతారు. చాలా అందంగా కనిపించే ఈ బీచ్ ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ బీచ్‌లో ఎర్ర పీతలు కనిపిస్తుంటాయి. అలాగే పర్యాటకులు సముద్ర వంటకాలను ఆస్వాదించవచ్చు. వీటితోపాటు ఒరియా, బెంగాళీ భోజనం కూడా లభిస్తుంది.

ఇక స్థానికులకు సముద్రం నీరు ఎప్పుడు వెనక్కి వెళ్తుందో బాగా తెలుసు. అలా సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు స్థానికులు ముత్యాలు, చేపలు, పీతలను ఏరుకుంటారు. అయితే రోజూ కంటే ఎక్కువగా నవంబర్ నుంచి మార్చి మధ్యలో ఈ బీచ్ నీరు అధికంగా వెనక్కి వెళ్లడం అధికంగా ఉంటుంది. ఆ సమయంలో బీచ్ కు పర్యాటకుల తాకిడి మరీ ఎక్కువగా ఉంటుంది.

ఎలా వెళ్లంటే..:

ఈ హైడ్ అండ్ సీక్ బీచ్ ఒడిశా లో ఉంది. భువనేశ్వర్ నుంచి జాతీయ రహదారి 5 మీదుగా 200 కిలోమీటర్ల దూరంలో బాలసూర్ జిల్లా రైల్వేస్టేషన్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి.

Also Read: 46 మెడికల్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్ .. అర్హత, చివరి తేదీని చెక్ చేయండి ఇలా

:కరోనా సమయంలో శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ ఆసనం వేస్తే వెంటనే రిలీఫ్