AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SAIL Recruitment 2021: 46 మెడికల్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్ .. అర్హత, చివరి తేదీని చెక్ చేయండి ఇలా

మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది., అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ..

SAIL Recruitment 2021: 46 మెడికల్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్ .. అర్హత, చివరి తేదీని చెక్ చేయండి ఇలా
Sail Jobs 2021,
Surya Kala
|

Updated on: Mar 29, 2021 | 2:05 PM

Share

SAIL Recruitment 2021:మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది., అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 1 నుండి సెయిల్ కెరీర్ పేజీ sailcareers.com ద్వారా ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు పంపడానికి చివరి తేదీ ఏప్రిల్ 30.

సెయిల్ మొత్తం 46 ఖాళీల భర్తని చేపట్టనుంది. జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న సెయిల్-రా మెటీరియల్స్ డివిజన్‌లోని వివిధ గనులలో ఖాళీగా ఉన్న పోస్టులలో నియామకం చేపట్టింది. వీటిల్లో 26 మెడికల్ ఆఫీసర్, 20 మెడికల్ స్పెషలిస్థ పోస్టులున్నాయి.

వయో పరిమితి

మెడికల్ ఆఫీసర్: 35 సంవత్సరాలు మెడికల్ స్పెషలిస్ట్: 41 సంవత్సరాలు. అయితే ఎస్సీ / ఎస్టీలకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఇవ్వగా.. ఓబిసి (ఎన్‌సిఎల్) అభ్యర్థులకు 3 ఏళ్ల వయసు సడలింపు ఇచ్చింది. ఇక ఆసక్తి కలిగి అర్హులైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్‌లో మరిన్ని వివరాలను చూడవచ్చు.

అభర్ధుల ఎంపిక ప్రక్రియ:

మెడికల్ ఆఫీసర్ [డెంటల్] / [OHS] / GDMO: రాత పరీక్ష / కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు కోల్‌కతాలో పరీక్షకు హాజరు కావాలి. మెడికల్ స్పెషలిస్ట్: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు రిజర్వ్డ్ / ఇడబ్ల్యుఎస్ కేటగిరీకి 50%, ఎస్సీ / ఎస్టీ / ఓబిసి (ఎన్‌సిఎల్) / పిడబ్ల్యుడి విభాగానికి 40% ఉంటుంది. తుది ఎంపిక కోసం, ఇంటర్వ్యూలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించబడుతుంది.

దరఖాస్తు రుసుము

అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ .500 చెల్లించాలి (ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి / ఇఎస్ఎం / డిపార్ట్‌మెంటల్ వారికి మినహాయింపు). సెయిల్ కెరీర్స్ పోర్టల్‌లో లభ్యమయ్యే “ఎస్‌బిఐ చలాన్” యొక్క ప్రింటౌట్‌తో అభ్యర్థి ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించాల్సి ఉంది.

దరఖాస్తు విధానం

అర్హతగల మరియు ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తును నింపిన దరఖాస్తును కవరులో పంపించాలి.

దరఖాస్తు పంపాల్సిన అడ్రస్

No. RMD/K/PERS/F-13/2021/446” by Speed post/ registered post addressed to DGM[Pers], Raw Materials Division, Steel Authority of India Ltd., 6 th Floor, Industry House Building, 10 Camac Street, Kolkata – 700017 [West Bengal]

Also Read: :కరోనా సమయంలో శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ ఆసనం వేస్తే వెంటనే రిలీఫ్

అన్నదాత వ్యవసాయానికి సాయం చేసిన ఓ యువరైతు.. డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్ సృష్టి..