Sarpasana:కరోనా సమయంలో శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ ఆసనం వేస్తే వెంటనే రిలీఫ్

Benefits of Sarpasana::ఓ వైపు కరోనా తో శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు జాగ్రత్తగా ఉండలని పలు వైద్యలు సూచిస్తున్నారు. ఇక ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో శరీరంపై ధ్యాస పెట్టె సమయం లేదు అని కొంతమంది..

Sarpasana:కరోనా సమయంలో శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ ఆసనం వేస్తే వెంటనే రిలీఫ్
Sarpasana
Follow us
Surya Kala

|

Updated on: Mar 29, 2021 | 1:29 PM

Benefits of Sarpasana:ఓ వైపు కరోనా తో శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు జాగ్రత్తగా ఉండలని పలు వైద్యలు సూచిస్తున్నారు. ఇక ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో శరీరంపై ధ్యాస పెట్టె సమయం లేదు అని కొంతమంది వాపోతున్నారు.. అయితే చిన్న చిన్న యోగాసనాలు ఇంట్లోనే కొంచెం సేపు వేయగలిగితే.. మనసు ప్రశాంతంగా.. శరీరం ఫిట్ గా ఉంటుంది. ఈరోజు ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరిచి.. ఆస్తమా వంటి వ్యాధులనుంచి రక్షణ కల్పించే సర్పసనం వేయు పద్దతి.. దాని ఉపయోగాలు తెలుసుకుందాం..!

సర్పసనం వేయు విధానం :

ముందుగా బొర్లా పడుకోవాలి. ఇప్పుడు నడుము వెనుక రెండు చేతులు కలిపి ఉంచాలి. రెండు పాదాలను కాలి వేళ్లమీద ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తలను, ఛాతిని నెమ్మదిగా పైకి లేపాలి. అరచేతులు, కాలివేళ్ల మీద మాత్రమే శరీర బరువును బ్యాలెన్స్ చేయాలి. ఈ స్థితిలో అర నిమిషం పాటు ఉండాలి. ఇలా వీలుకానివారు మోకాళ్లను భూమి మీద ఆన్చి ఉంచవచ్చు. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ యథాస్థితికి రావాలి. రెండు చేతులు ముందుకు చాపి రిలాక్స్‌ అవ్వాలి. తిరిగి ఇదే క్రమంలో మళ్లీ సాధన చేయాలి. ఇలా కుడివైపు, ఎడమవైపు పదిసార్లు రిపీట్ చేయాలి.

ఈ ఆసనం ఉపయోగాలు..

* ఆస్త్మా ఉన్నవారికి చాలా మంచిది. * ఊపిరితిత్తులు పనితీరు మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వేయడంతో ఊపిరితిత్తులు వ్యాకోచించి ఆక్సిజన్‌ బాగా అందుతుంది. *శ్వాసకోశ వ్యాధుల నుంచి రిలీఫ్ ఇస్తుంది. *నడుము కండరాలు బలోపేతం అవుతాయి. *గుండె కండరాలు బలపడతాయి. *నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. * వెన్నెముక బాగా సాగి బలాన్ని సంతరించుకుంటుంది. *జీర్ణకోశ సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక :

*హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకుని వేయాల్సి ఉంటుంది. * గర్భిణీలు చేయకూడదు. * పొట్టకి సర్జరీలు అయిన వారు చేయవద్దు. *హెర్నియా, అల్సర్ ఉన్నవాళ్లు ఈ ఆసనాన్ని అసలు వేయకూడదు

Read Also: అన్నదాత వ్యవసాయానికి సాయం చేసిన ఓ యువరైతు.. డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్ సృష్టి..

కరోనా నిబంధనలను పాటిస్తూ.. సేఫ్ గా రంగుల పండుగను జరుపుకుంటున్న హీరోయిన్లు జెనీలియా, రష్మిక, రకుల్