AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Care Tips For Holi: మీ కళ్ళను భద్రం చేసే టిప్స్ ను పాటించండి…. రంగుల కేళి.. హోలీని ఎంజాయ్ చేయండి

రంగుల పండగ హొలీ ని కరోనా నిబంధనల నడుమ జరుపుకుంటున్నారు. అయితే పూర్వంలో ఎండిన పూల నుంచి, ఆకుల నుంచి రంగులను తయారు చేసి హోలీకి వాడితే.. ఇప్పుడు రసాయనాలతో కూడిన కృతిమ..

Eye Care Tips For Holi:  మీ కళ్ళను భద్రం చేసే టిప్స్ ను పాటించండి.... రంగుల కేళి.. హోలీని ఎంజాయ్ చేయండి
Holi Festival Eye Care
Surya Kala
|

Updated on: Mar 29, 2021 | 11:21 AM

Share

Holi 2021: రంగుల పండగ హొలీ ని కరోనా నిబంధనల నడుమ జరుపుకుంటున్నారు. అయితే పూర్వంలో ఎండిన పూల నుంచి, ఆకుల నుంచి రంగులను తయారు చేసి హోలీకి వాడితే.. ఇప్పుడు రసాయనాలతో కూడిన కృతిమ రంగులను వాడుతున్నాడు. దీంతో హొలీ వేడుకల సమయంలో కంటి సంరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. లేదంటే కంటిచూపుకి హాని కలగ వచ్చు.

హొలీ ఆడేముందు కంటి చర్మం చుట్టూ కొబ్బరి నూనె బాదం నూనె రాసుకోవడం మంచిది.. దీని వల్ల రంగులకు కళ్ళు చుట్టూ ఉన్న చర్మం పాడవకుండా ఉంటుంది. అంతేకాదు.. ఎవరైనా రంగుల నీరు మీ ముఖం మీద జల్లితే.. ఆ నీరు కళ్ళలోకి చేరకుండా అడ్డుకుంటుంది. ఇక కళ్ళకు ప్రొటెక్టివ్‌ గ్లాస్‌లు, సన్‌గ్లాసెస్‌ లేదా ప్లెయిన్‌ గ్లాస్‌లు అప్లై చేసినా రక్షణ అందిస్తాయి. రంగులు కళ్లలో చేరకుండా రక్షణ కలిగిస్తాయి.

ఒకవేళ రంగులు మీ కళ్ళలో పడితే.. వెంటనే వాటిని తీసివేయండి.. శుభ్రమైన నీటితో తరచుగా కళ్ళను శుభపరచుకోండి. అలాగని మీ కళ్లలోని నేరుగా నీరు పోయడం చేయరాదు. అలా చేస్తే అది ఇంకా ప్రమాదకరంగా మారవచ్చు. ఇక కళ్ళను తరచుగా మూసి తెరుస్తూ.. ఎక్సర్ సైజ్ తో పాటు.. కళ్లను పైకి, క్రిందకు తిప్పడం ద్వారా రంగులను వీలైనంత వరకూ తొలగించవచ్చు. .

ఇక హొలీ ఆడేవారు టోపీ పెట్టుకుంటే.. రంగు నీరు మీ మీద చల్లినా.. అవి కంటి లోకి చేరకుండా నివారించవచ్చు.. ఎందుకంటే హోలీలో వాడుతున్న రంగులు రసానికానివి.. అందుకని హొలీ ఆడుతున్న సమయంలో ఆ రంగులు కంటి లో పడితే.. కళ్ళకు ఇన్ ఫెక్షన్ కలుగుతుంది. ఎలర్జీ కూడా రావచ్చు. హొలీ ఆడిన తర్వాత ఒకవేళ ఎవరి కళ్ళైనా ఎర్రగా అయ్యి.. దురద పెడుతున్నా కంటి నుంచి నీరు కారుతున్నా… వెంటనే ఐ స్పెషలిస్ట్ ను సంప్రదించండి. ముఖ్యంగా హొలీ అదే సమయంలో కళ్ళను నలుపకపోవడం మంచిది. అసలు రంగుల చేతులతో కంటికి తాకక పోవడం అత్యుత్తమం..

ఇక కొంతమంది రంగులను నింపిన నీటి బెలూన్స్ తో హొలీ ఆడతారు.. వాటికీ ఎంత దూరంగా ఉంటె అంతమంచిది. ఎందుకంటే రంగుల బెలూన్స్ తో హొలీ కళ్లకు తీవ్ర గాయాలను కలిగించే ప్రమాదం ఉంది. ఈ కారణంగా రక్తస్రావం, కంటి లోపల కటకాలు స్ధానభ్రంశం కావడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు.. ఒకొక్కసారి కంటి చూపు కోల్పోవడం లేదా మొత్తానికి కంటినే కోల్పోవడం కూడా జరుగవచ్చు.

ముఖ్యంగా హొలీ ఆడుతున్న సమయంలో కాంటాక్ట్‌లెన్స్‌లు ఉపయోగించవద్దు. ఎందుకంటే కాంటాక్ట్‌లెన్స్‌లో నీటిని పీల్చుకునే లక్షణాలు ఉన్నాయి. కంటిలో పడిన రంగు నీళ్లను అది పీల్చుకోవడం వల్ల అలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది. ఇక రంగులు చల్లుకుని ముందు కళ్లజోడును ధరించకపోవడం మంచిది. కళ్ళను సురక్షితంగా ఉంచుకుంటూ.. రంగుల కేళి హోలీని ఎంజాయ్ చేయండి.

Also Read:  అందరూ మంచివాళ్ళే.. మరి అమ్మని ఎందుకు నాన్న ఇష్టపడడు అని ప్రశ్నిస్తున్న శౌర్య..

 ఇంటర్నెట్ యూజర్స్‌.. గూగుల్ క్రోమ్‌లో ఉన్న ఈ ఫీచర్స్ మీకు తెలుసా?.. ఒక్కసారి చూశారంటే..