AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam Serial: అందరూ మంచివాళ్ళే.. మరి అమ్మని ఎందుకు నాన్న ఇష్టపడడు అని ప్రశ్నిస్తున్న శౌర్య..

Karthika Deepam latest episode శౌర్య హిమకి బ్రెడ్ తినిపిస్తూ.. నాన్నమ్మకి తమ అడ్రస్ చెబితే.. తీసుకుని వెళ్తుంది.. హాస్పటల్ లో వైద్యం చేస్తారు అని శౌర్య ఆలోచిస్తుంటే.. హిమ వారిస్తూ.. నాన్న మనల్ని మాత్రమే తీసుకుని వెళ్తానంటే ..

Karthika Deepam Serial:  అందరూ మంచివాళ్ళే.. మరి అమ్మని ఎందుకు నాన్న ఇష్టపడడు అని ప్రశ్నిస్తున్న శౌర్య..
Karthika Deepam March29th
Surya Kala
|

Updated on: Mar 29, 2021 | 10:47 AM

Share

Karthika Deepam Serial: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకీ ఆసక్తికరంగా మారింది. ఈరోజు (మార్చి 29-2021)న 999 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. డాక్టర్ బాబు పిల్లల దగ్గరకు చేరుకున్నాడా..? దీప ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందా…? మోనిత కుట్రను కార్తీక్ ఎప్పటికైనా గుర్తిస్తాడా..? ఈరోజు అసలు ఏం జరుగుతుంది ముందుగానే చూద్దాం..!

శౌర్య హిమకి బ్రెడ్ తినిపిస్తూ.. నాన్నమ్మకి తమ అడ్రస్ చెబితే.. తీసుకుని వెళ్తుంది.. హాస్పటల్ లో వైద్యం చేస్తారు అని శౌర్య ఆలోచిస్తుంటే.. హిమ వారిస్తూ.. నాన్న మనల్ని మాత్రమే తీసుకుని వెళ్తానంటే .. అమ్మని వదిలేసి పోదామా.. అంటుంటే.. ఛీ ఛీ అలా ఎలా చేస్తాం.. అప్పుడు అమ్మ ఏం అయిపోతుంది.. అని ప్రశ్నిస్తుంది.. దీంతో శౌర్య అవును కదా.. నేను అంతదూరం ఆలోచించలేదు అంటుంది.

ఇక మోనిత కార్తీక్ కాల్ చేస్తుంటే.. కట్ చేస్తాడు.. దీంతో మోనిత లో అనుమానం మొదలవుతుంది. మురళీ కృష్ణ దీపని పిల్లని తీసుకొచ్చాడా… వాళ్లతో గడుపుతూ.. నన్ను పట్టించుకోవడం లేదా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది. ఎం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తుంది..

ఇక మరోవైపు దీప ని తీసుకుని తండ్రి ఇంటికి వస్తాడు.. హిమ శౌర్య ఒడిలో నిద్రపోతుంది.. అమ్మ వచ్చింది లే అంటూ లేపుతుంది.. వద్దు నిద్రపోనీ అని దీప అంటే..లేదు అమ్మా నువ్వు వస్తే నిద్రలేపమని చెప్పింది.. అందుకే అంటుంది శౌర్య., ఇక పిల్లలు ఎలా ఉంది అమ్మా అని కంగారు పడతారు.. నాలుగు రోజుల పాటు నువ్వు ఇడ్లీ బండి దగ్గరకు రావద్దు అని శౌర్య చెబుతుంది. మేము చూసుకుంటాం టిఫిన్ సెంటర్. ఐదుగురు ఉన్నాం .. నువ్వు రెస్ట్ తీసుకో అని దీపని ఒప్పిస్తుంది. అచ్చు మీ అత్తగారే అంటారు మురళీ కృష్ణ.

ఇక సౌందర్య, ఆనందరావులు దీప కోసం ఆలోచిస్తారు..మనపేదరికం తాలూకా నిస్సహాయత. ఇక్కడ న్యాయం జరగదని ఎప్పుడైతే వెళ్లిపోయిందో.. అప్పుడే ఈ కథ ముగిసింది.. మీలో ఆశావాదం లేదా.. దీపని వెనక్కి తీసుకొచ్చేది ఎవరు అని ఆనందరావు అంటే.. ఎవరు కార్తీక్ మాత్రమే.. అని ధీమా వ్యక్తం చేస్తుంది. తీసుకొస్తే.. ఎక్కడ పెడతావ్.. ఏ పూజా గదిలో శిలాఫలకంలా పెడతావా..? అని ప్రశ్నిస్తాడు.. దీప దీపం అది భర్త గుండెల్లోనే వెలగాలి.. నువ్వు తీసుకొచ్చి.. గాలిలో పెడతానంటావు.. మనకు ఆ కోడలు వద్దు.. భార్యకి భర్తే కావాలి.. మిగతావన్నీ కూడా భర్త తర్వాతె.. భర్త ఇచ్చే భరణం కంటే.. తాళి ఆభరణంగా మోస్తుంది. అలంటి దీప ఎందుకువస్తుంది. ఒకవేళ వాడికి దీప ఎదురుపడితే.. అని ప్రశ్నిస్తుంది సౌందర్య.. ఒకవేళ వాడికి దీప ఎదురు పడితే.. సౌందర్య, ఆనందరావు కోడలుగా రమ్మని పిలిస్తే.. వచ్చిన దారినే వాళ్ళమంటుంది. అయినా వాడు ఆ అనడు.. ఎందుకంటే వాడికి పిల్లల్ని మాత్రమే వెనక్కి తీసుకొస్తాడు.. . తప్ప దీపని రమ్మనమని అనడు.. అంటే దీప ఎప్పటికీ రాదు అంటూ సౌందర్య కన్నీరు పెడుతుంది.

భాగ్యం గురక పెడుతూ నిద్రపోతుంటే.. మోనిత ఇంట్లోకి అడుగు పెట్టి.. భాగ్యంగారు అని పిలుస్తుంది. ఉల్కిపడి లేచిన భాగ్యాన్ని మోనిత మురళీ కృష్ణ గారు రాలేదా అని ప్రశ్నిస్తుంది.. దీంతో భాగ్యం మోనిత ని ఇన్ డైరెక్ట్ గా ఓ రేంజ్ లో తిట్లు తిట్టి.. ఒక్కసారి ఫోన్ చేస్తాను నువ్వు అడుగు అంటుంది భాగ్యం.. వద్దు నేను వస్తాను అంటుంది మోనిత … నువ్వు వచ్చి ఎన్ క్వైరీ చేస్తున్నావని మా ఆయన ఫోన్ చేసినప్పుడు చెబుతాను అంటుంది.. వద్దులే మీ గొడవల్లో నన్ను లాగకండి.. అంటూ మోనిత వెళ్ళిపోతుంది.

ఇక దీపకి మందులు ఇస్తుంది హిమ… డాక్టర్ బాబు కూతుర్ని కదా ఎందుకు రాదు అంటుంది హిమ.. కార్తీక్ చాలా మంచివాడు.. వైద్యం చేస్తాడు.. మందులు కూడా ఫ్రీగా ఇస్తాడు.. ఒక్క తాతయ్యకు ఏమిటి..? మొన్న సరోజక్క వాళ్ళ చెల్లి అరుణ వాళ్ళ ఆయనకి కూడా హార్ట్ ప్రాబ్లెమ్ వస్తే.. శౌర్య మేడం రికమండేషన్ తో ఫ్రీగా వైద్యం చేశారు.. పని చేయవద్దని పదివేలు కూడా ఇచ్చారు.. మీ కుటుంబం అంతా అంతే అని మురళీ కృష్ణ అంటే.. శౌర్య కలుగజేసుకుని మరి మా నాన్న మా అమ్మని ఎందుకు వదిలేశాడు.. మా అమ్మ ఎం తప్పు చేసింది. మా అమ్మ ఎప్పుడు మా నాన్నని గానీ ఎవరినీ గానీ ఏమీ అనడు కదా.. అలాంటి మంచి అమ్మ మా నాన్నకు ఎందుకు నచ్చడం లేదు.., నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు.. వాళ్ళు మంచివాళ్ళే…. మా అమ్మ మంచే.. అయినా మా అమ్మ ఆ ఇంట్లో ఎందుకు ఉండకూడదు.. అంటూ దీపని,, మురళీ కృష్ణని నిలదీస్తుంది. మమ్మల్ని ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చావు.. ఆలస్యం అయింది అమ్మని నిద్రపోనీయమ్మ అంటాడు మురళీ కృష్ణ.. మనం చూసినప్పుడు అమ్మ నిద్రపోతుంది తాతయ్య.. కానీ ఎప్పడూ నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. .. కార్తీక్ పిల్లల దగ్గరకు చేరుకుంటాడా..? ఏ నిర్ణయంతీసుకుంటాడు రేపటి ఎపిసోడ్ లో చూడాలి మరి.

Also Read: ఈ లోహం బంగారం కంటే మూడు రెట్లు ఎక్కువ విలువైనది..! ప్లాటీనం కాదు..! బిట్‌కాయిన్‌ను మించిపోయింది..!

వికరాబాద్‌లో నాటు తుపాకుల కలకలం.. 10 మంది అరెస్టు, నాలుగు నాటు తుపాకులు, 9 మొబైళ్లు, 5 బైక్‌లు స్వాధీనం

Follow Us