AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ఇలా చేస్తే అమ్మాయిలతోపాటు అబ్బాయిలూ అందంగా కనిపించవచ్చు.. ఏం చేయాలంటే..?

Homemade Beauty Tips: అందం విషయంలో అమ్మాయిలు తీసుకున్నన్ని జాగ్రత్తలు అబ్బాయిలు మాత్రం అస్సలు తీసుకోరు. ఇది మనందరికీ తెలిసిందే. ఏదో ఒక ఫేస్ క్రీమ్ అద్దుకోవడమో

Beauty Tips: ఇలా చేస్తే అమ్మాయిలతోపాటు అబ్బాయిలూ అందంగా కనిపించవచ్చు.. ఏం చేయాలంటే..?
Beauty Tips For Mens
Shaik Madar Saheb
|

Updated on: Mar 29, 2021 | 5:29 AM

Share

Homemade Beauty Tips: అందం విషయంలో అమ్మాయిలు తీసుకున్నన్ని జాగ్రత్తలు అబ్బాయిలు మాత్రం అస్సలు తీసుకోరు. ఇది మనందరికీ తెలిసిందే. ఏదో ఒక ఫేస్ క్రీమ్ అద్దుకోవడమో లేకపోతే.. పౌడర్ రాయడం లాంటివి చేసి సరిపెట్టేసుకుంటారు. అందంగా కనిపించేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. అసలే ఎండాకాలం.. ఎక్కడికి వెళ్లినా.. ముఖం నల్లగా మారి జిడ్డు జిడ్డుగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని ఈజీ టిప్స్‌ పాటిస్తే.. అమ్మాయిలతోపాటు.. అబ్బాయిలు కూడా అందాన్ని కాపాడుకోచవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

● ఎండాకాలంలో తరచూ ముఖం జిడ్డుగా కనిపిస్తుంటుంది. దీంతోపాటు నల్లగా మారుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఒక చిన్న పౌడర్ డబ్బా వెంట తీసుకెళ్లడం మంచిది. లేకపోతే.. ఫేస్ శానిటైజర్‌ను వెంట తీసుకెళ్లాలి. ఫేస్ శానిటైజర్ మీ ముఖాన్ని ఫ్రెష్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. చేతిలో రెండు చుక్కలు శానిటైజర్ వేసి.. ముఖాన్ని దూది లేదా టిష్యూ పేపర్‌, రుమాల్‌తో తుడుచుకొని అనంతరం నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. దీంతో ముఖం క్లీన్‌ అయి తళతళ మెరుస్తుంది.

● ఎండాకాలంలో ముఖం కమిలిపోవడం సర్వ సాధారణం. ఈ సమస్య తీరాలంటే ముఖానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటే సరిపోతుంది. ఒక వేళ మీ దగ్గర లోషన్ లేకపోతే ఇంట్లో ఉన్న పదార్థాలతో ఇట్టె ఈ సమస్యను దూరం చేయవచ్చు. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో బేకింగ్ సోడా కలిపి కమిలిన చోట రాస్తే.. వెంటనే చర్మం సాధారణ రంగులోకి మారిపోతుంది.

● ఇంకా మొటిమలు తగ్గేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఏవేవో క్రీములు రాస్తూ.. ఖరీదైన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగిస్తుంటారు. ఈ సమస్యను మీ ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు.

● ముఖాన్ని ఉదయం సాయంత్రం వేళ సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కలబందను తీసుకొని దానిలో ఉండే జిగురు పదార్థంను ముఖంపై మర్దనా చేయాలి. దీంతో తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.

● కొందరికి కళ్లు వాచి ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఆ సమస్య తీరాలంటే చల్లటి పదార్థాలను లేదా.. ఐస్ క్యూబ్ లాంటివి ఓ గ్లాస్‌లో వేసి.. కంటి చుట్టూ మర్ధనా లాగా చేయాలి. ఇలా కొంత సేపు చేస్తే కళ్ల వాపు తగ్గి ముఖం అందంగా మారుతుంది.

Also Read:

Overthinking Habits : మీరు అతిగా ఆలోచిస్తారా..? అయితే ఈ సమస్యల భారిన పడ్డట్లే..! ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి..

Corona Risk Down: కరోనా మీ దరి చేరకూడదనుకుంటున్నారా..? అయితే హాయిగా నిద్రపోండి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన..