Corona Risk Down: కరోనా మీ దరి చేరకూడదనుకుంటున్నారా..? అయితే హాయిగా నిద్రపోండి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన..

Sleep Related To Corona Risk: కంటికి కనిపించని ఓ వైరస్‌ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఏడాదిన్నర గడుస్తోన్నా ఆ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను ఈ వైరస్‌ హరించేసింది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలాయి. అయితే..

Corona Risk Down: కరోనా మీ దరి చేరకూడదనుకుంటున్నారా..? అయితే హాయిగా నిద్రపోండి.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన..
Good Sleep Decrease Corona
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 28, 2021 | 1:15 PM

Sleep Related To Corona Risk: కంటికి కనిపించని ఓ వైరస్‌ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఏడాదిన్నర గడుస్తోన్నా ఆ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను ఈ వైరస్‌ హరించేసింది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలాయి. అయితే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక కాస్త ఉపశనం లభిస్తోందని అంతా భావించారు. కానీ ప్రస్తుతం విజృంభిస్తోన్న సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రజలు మళ్లీ భయాందోళనలకు గురవుతున్నారు. అయితే కొన్ని స్వీయ నియంత్రణలను పాటించడం ద్వారా కరోనా ఎప్పటికీ మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతూనే ఉన్నారు. మంచి ఆహారం తీసుకోవడం, మాస్కులు ధరించడం వల్ల కరోనా బారి నుంచి తప్పించుకోవచ్చని మనకు తెలిసిందే. అయితే కంటి నిండా నిద్ర కూడా కరోనాకు చెక్‌ పెడుతుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. సహజంగానే సరిపడ నిద్ర ఉంటే మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చనే విషయం తెలిసిందే. అయితే నిద్రలేమితో బాధపడేవారిలో రోగ నిరోధక శక్తి మందగిస్తుందని ఈ కారణంగా మానవ శరీరంలోకి వైరస్‌ ప్రవేశించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని శాస్ర్తవేత్తల అధ్యయనంలో తేలింది. ఫ్రాన్స్‌, జర్మీన, ఇటలీ, స్పెయిన్‌, యూకే, అమెరికా దేశాల్లో కరోనా బారిన పడివారిని పరిగణలోకి తీసుకొని పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో వారు ఎంత సేపు నిద్రపోతారనే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. సుమారు 40 శాతం మందికి మానసిక ఒత్తిళ్ల కారణంగానే వైరస్‌ సులభంగా సోకినట్లు తెలిపారు. కాబట్టి పోషక ఆహారం, కంటి నిండా నిద్రతో కరోనాకు చెక్‌ పెట్టొచ్చన్నమాట.

Also Read: India Corona : దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఒక్కరోజే 312 మంది మృతి.. గడిచిన 24 గంటల్లో కేసుల వివరాలు..

మరోసారి తెలంగాణలో గుబులు పుట్టిస్తున్న కరోనా వైరస్.. కొత్తగా 535 మందికి పాజిటివ్‌

Telangana Corona: తెలంగాణలో మాస్క్ మస్ట్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. సర్కార్ కీలక ఆదేశాలు