Telangana Corona: తెలంగాణలో మాస్క్ మస్ట్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. సర్కార్ కీలక ఆదేశాలు

Telangana Corona: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. గతంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం

Telangana Corona: తెలంగాణలో మాస్క్ మస్ట్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. సర్కార్ కీలక ఆదేశాలు
ప్రతీకాత్మక చిత్రం
Follow us
Subhash Goud

|

Updated on: Mar 27, 2021 | 9:43 PM

Telangana Corona: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. గతంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తాజాగా ప్రభుత్వం పలు ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరికి మాస్కులు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఏప్రిల్‌ 10వ తేదీ వరకు సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధించింది. పండగలపై ఆంక్షలు విధించింది. ర్యాలీలు, యాత్రలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హోళీ, శ్రీరామనవమి వేడుకల్లో జనాలు గుమిగూడవద్దని ఆదేశాల్లో పేర్కొంది. ప్రతి ఒక్కరు మాస్క్‌ లేకుండా బయట తిరగవద్దని తెలిపింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలో సెకండ్‌ వేవ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతోందని తెలిపింది. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ రెండు జీవోలు జారీ చేశారు. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు.

ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ రెండు జీవోలు జారీ చేశారు. నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించారు. ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆయన ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

కాగా, తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 495 పాజిటివ్ కేసులు నమోదు కావడంపై మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనాతో ఇద్దరు మృతి చెందారు. నిన్న ఒక్కరోజులో 247 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4,241 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 1,870 బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,05,804కు చేరుకుంది. ఇక మొత్తం మృతి చెందిన వారి సంఖ్య1,685కు చేరింది.

ఇవీ కూడా చదవండి: Covid-19 Spike: కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోండి.. కంటైన్మెంట్‌ జోన్లను ప్రకటించండి.. పలు రాష్ట్రాలకు కేంద్రం సూచన

Covid-19 Second Wave: దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి… సెకండ్‌వేవ్‌లో వైరస్‌ బారిన పడ్డ సెలబ్రేటీలు

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..