Covid-19 Second Wave: దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి… సెకండ్‌వేవ్‌లో వైరస్‌ బారిన పడ్డ సెలబ్రేటీలు

Covid-19 Second Wave: కరోనా మహమ్మారి దేశంలో సెకండ్‌ వెవ్‌ కొనసాగుతోంది. గతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది...

Covid-19 Second Wave: దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి... సెకండ్‌వేవ్‌లో వైరస్‌ బారిన పడ్డ సెలబ్రేటీలు
Second Wave Of Covid 19
Follow us
Subhash Goud

|

Updated on: Mar 27, 2021 | 6:26 PM

Covid-19 Second Wave: కరోనా మహమ్మారి దేశంలో సెకండ్‌ వెవ్‌ కొనసాగుతోంది. గతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వైరస్‌ సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. తాజాగా కరోనా బాధితుల్లో భారత క్రెకెట్‌ మాజీ కెప్టెన్‌ సచిన్‌ టెండుల్కర్‌ కూడా చేరిపోయారు. కరోనా నుంచి ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. సచిన్‌ను వదిలిపెట్టలేదు. తాజాగా ఆయన కరోనా బారిన పడ్డారు. ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తెలిపారు. కరోనా నాకు సోకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. కానీ పాజిటివ్‌ వచ్చింది అని అన్నారు. చిన్నపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లోని మిగతా వారందరికి కరోనా నెగెటివ్‌గా వచ్చింది అని తెలిపారు. కాగా, ప్రస్తుతం సచిన్‌ ఇంట్లోనే క్వారంటైన్‌ అయ్యారు. ఇందుకు సంబంధించి వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు, సూచనలు, సలహాలు పాటిస్తున్నట్లు చెప్పారు. కరోనా విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.

అలాగే ఎంతో మంది సెలబ్రేటీలు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు పరేష్ రావల్ కూడా కరోనా బారిన పడ్డారు. అంతేకాదు.. మిలింద్ సోమన్, ఆర్ మాధవన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, రోహిత్ సరఫ్, సిద్ధాంత్ చతుర్వేది, మనోజ్ బాజ్‌పేయి వంటి సినిమా తారలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇలా కరోనా సెకండ్‌వెవ్‌లో ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తుండటంతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రంగా నమోదువుతున్నాయి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!