Covid-19 Spike: కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోండి.. కంటైన్మెంట్ జోన్లను ప్రకటించండి.. పలు రాష్ట్రాలకు కేంద్రం సూచన
Union Health Secretary: భారత్‌లో కరోనావైరస్ కొరలు చాస్తోంది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని నెలల తరువాత నిన్న
Union Health Secretary: భారత్‌లో కరోనావైరస్ కొరలు చాస్తోంది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని నెలల తరువాత నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో శనివారం.. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి 12 రాష్ట్రాల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 12 రాష్ట్రాల అదనపు ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, పలు మునిసిపల్ కమిషనర్లు, 46 జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, అవలంభించాల్సిన విదివిధానాలపై సమీక్షించారు.
ముఖ్యంగా 46 జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో కేసుల కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతోపాటు కేసుల తీవ్రతను బట్టి కంటైన్మెంట్ జోన్లతో కోవిడ్‌ను కట్టడి చేయాలని సూచించారు. దీంతోపాటు రోజూవారీ పరీక్షల సంఖ్యను పెంచాలన్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని.. అర్హులందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. దీంతోపాటు కాంటాక్ట్ ట్రేసింగ్‌ను చేపట్టాలని.. దీంతోనే కరోనాను కట్టడి చేయగలమని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సిన్‌కు కొరత లేదని.. క్రమానుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మరి కొన్నిరోజుల్లో పండుగలు రానున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మహారాష్ట్ర, గుజరాత్, హర్యాణా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, జమ్ము-కాశ్మీర్, కర్నాటక, పంజాబ్, బీహార్ రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ఎక్కువగా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డా. వీకే పాల్ కూడా పాల్గొన్నారు.
Also Read: