Overthinking Habits : మీరు అతిగా ఆలోచిస్తారా..? అయితే ఈ సమస్యల భారిన పడ్డట్లే..! ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి..

Overthinking Habits : అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా, ఆరోగ్యానికి కలిగే నష్టం చాలా ఎక్కువ. ఇది చెడు అలవాట్లకు దారి తీస్తుంది. దీని వల్ల తాత్కాలిక

Overthinking Habits :  మీరు అతిగా ఆలోచిస్తారా..? అయితే ఈ సమస్యల భారిన పడ్డట్లే..! ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి..
Overthinking Habits
Follow us
uppula Raju

|

Updated on: Mar 28, 2021 | 12:00 PM

Overthinking Habits : అతిగా ఆలోచించడం వల్ల మానసికంగా, ఆరోగ్యానికి కలిగే నష్టం చాలా ఎక్కువ. ఇది చెడు అలవాట్లకు దారి తీస్తుంది. దీని వల్ల తాత్కాలిక ఉపశమనం కోసం వెంపర్లాడుతుంటారు. అందుకోసం మందులు, మద్యాన్ని ఆశ్రయించడం వంటివి చేస్తారు. అతిగా ఆలోచించడం వల్ల కలిగే అనర్థాలను తెలుసుకోండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల అతి నిద్ర, ఎక్కువగా తినడం వంటివి మీకు తెలియకుండానే చేస్తూ ఉంటారు. అధిక సమాచారం కోసం కోసం ఆరాటపడుతుంటారు. మీకు తెలియకుండానే ప్రతికూల ఆలోచనలలో ఇరుక్కుంటారు. దీని వల్ల సామాజిక సమావేశాలు, కొత్త వారిలో కలవలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

అతిగా ఆలోచిస్తున్నారనడానికి మెదట్లో కనిపించే లక్షణాలు అలసటగా ఉండటం, ఎక్కువగా కలల కనడం, నిదానంగా వ్యవహరించడం వంటివి ఉంటాయి. గడిచిన సంఘటనల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఇది మీ మనస్సులో గతంలో జరిగిన మానసిక గాయాన్ని నిద్రలేపుతూ ఉంటుంది. మీరు పాజిటివ్‌గా కాకుండా నెగిటివ్‌ ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి తప్పించుకోవడానికి ఈ ఐదు పద్దతులను ఒక్కసారి ప్రయత్నించండి..

1. లక్ష్యంపై దృష్టి సారించండి.. మీరు అతిగా ఆలోచించి మీ సమయాన్ని వృథా కానివ్వకండి.. ప్రస్తుతం ఉన్న సమస్యపై దృష్టి సారించండి.. ఆలస్యం అవుతుందని బాధపడకండి.. దానిపైనే మనసు లగ్నం చేసి పని చేయండి.. కచ్చితంగా మీ భవిష్యత్ మారిపోతుంది.

2. పరధ్యానాన్ని విడిచిపెట్టండి.. మీ మనస్సును యాదృచ్చిక ఆలోచనల నుంచి దూరంగా ఉంచండి.. అలా వీలు కాకపోతే సంగీతం, వంట, నృత్యం, పాటలు వినడం, టీవీ కార్యక్రమాలు చూడటం, రాయడం, పెయింటింగ్ లేదా ఆన్‌లైన్ యోగా సెషన్‌కు హాజరు కావడం వంటిపై దృష్టి సారించండి.. ఈ విధంగా మీరు మీ మనస్సును చురుకుగా ఉంచుకోండి..

3. ఆత్మపరిశీలన చేసుకోవడానికి సమయం కేటాయించండి.. స్వీయ ప్రతిబింబం, ఆత్మపరిశీలన, విశ్లేషణ కోసం సమయాన్ని కేటాయించడం ఎల్లప్పుడూ మంచిది. రోజంతా మీ ఆలోచనలతో ఇబ్బంది పడేకంటే ప్రతి రోజు 30 నిమిషాలు స్వీయ ప్రతిబింబంలో గడపవచ్చు, మీ లక్ష్యాలు ఏమిటి, రాబోయే కొద్ది రోజుల్లో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు అనే విషయాలు తెలుస్తాయి.

4. ప్రతికూల ఆలోచనలను విస్మరించండి.. మీరు ప్రతికూలంగా ఆలోచించడం మానుకోండి. వాటిని మీ మైండ్ నుంచి డిలీట్‌ చేయండి. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టండి. అప్పుడు మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.

5. వర్తమానంపై దృష్టి పెట్టండి.. వర్తమానంపై దృష్టి పెట్టండి.. కానీ ఫలితాల గురించి మరచిపోండి. మీ లక్ష్యంపైనే గురిపెట్టండి.. అనుకున్నది సాధించండి.. ప్రాపంచిక ఆనందాల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.. మీకు భయం కలిగించే విషయాల నుంచి దూరంగా ఉండండి.. ప్రతి రోజు ధ్యానం చేయండి.. మీ ల్యాప్‌టాప్‌ను ఆపివేసి, సాయంత్రం కొద్దిసేపు నడకను ప్రారంభించండి.. ప్రకృతి మధ్యలో సంచరించండి.. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి..

Holi Festival Special : హోలీ రోజున అక్కడ ఆనందోత్సవాలతో పిడిగుద్దులాట జరుపుకుంటారు.

Holi 2021: మీ ఫ్రెండ్స్‏కు హోలీ విష్ చేసారా ? అయితే వాట్సప్‏లో ఈ అందమైన హోలీ స్టిక్కర్లను పంపెయండిలా..