AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2021: మీ ఫ్రెండ్స్‏కు హోలీ విష్ చేసారా ? అయితే వాట్సప్‏లో ఈ అందమైన హోలీ స్టిక్కర్లను పంపెయండిలా..

Happy Holi 2021: ప్రస్తుత కాలంలో పుట్టినరోజు, పెళ్లిరోజు, పండగలకు అందరూ వాట్సప్‏లో విష్ చేసుకుంటున్నారు. గతేడాది అసలు హోలీ

Holi 2021: మీ ఫ్రెండ్స్‏కు హోలీ విష్ చేసారా ? అయితే వాట్సప్‏లో ఈ అందమైన హోలీ స్టిక్కర్లను పంపెయండిలా..
Holi Whats App Stickers
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2021 | 11:49 AM

Share

Happy Holi 2021: ప్రస్తుత కాలంలో పుట్టినరోజు, పెళ్లిరోజు, పండగలకు అందరూ వాట్సప్‏లో విష్ చేసుకుంటున్నారు. గతేడాది అసలు హోలీ పండగ జరుపుకోలేదు. మరీ ఈసారి కోవిడ్ నిబంధనల మధ్య అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఈ హోలీ వేడుకలను జరుపుకోండి. అలాగే.. మీకు దూరంగా ఉండిపోయిన ఈ ఆత్మీయులకు హోలీ శుభాకాంక్షలు చెప్పండి. అయితే హోలీ విషెస్ కేవలం టెక్ట్స్ మేసేజేస్.. వీడియోస్, ఫోటోస్ కాకుండా… ఈసారి సరికొత్తగా హోలీ స్టిక్కర్లను పంపి.. మీ సన్నిహితులను విష్ చేయండి. అందుకోసం మీ వాట్సప్‏లో అందమైన స్టిక్కర్లను వెతికిపట్టుకోండి. మరీ ఎలా ఆ స్టిక్కర్లను వెతకాలో తెలుసుకుందామా..

వాట్సప్‏లో హోలీ సిక్టర్లను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం..

1. చాట్ బార్ యొక్క ఎడమ వైపున ఉన్న ఎమోజీ పై క్లిక్ చేసి ఆ తర్వాత… కింద స్టిక్కర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 2. వెంటనే వాట్సప్ స్టిక్కర్స్ బార్ ఓపెన్ అవుతుంది. అందులో కిందికి స్క్రోల్ చేసి.. ప్లేస్టోర్ లోగోతో మరిన్ని స్టిక్కర్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. 3. వెంటనే ప్లే స్టోర్ ఓపెన్ అవుతుంది. అందులో హోలీ స్టిక్కర్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. 4. అక్కడ మీకు నచ్చిన హోలీ స్టిక్కర్స్‏ను డౌన్ లోడ్ చేసుకోండి. ఒక వేళ మీకు వాట్సప్ స్టిక్కర్స్ ఏవి అందమైనవి అనే సందేహం కలిగితే వాటిలో జగన్నాథ్ టేక్నాలజీకి సంబంధించిన స్టిక్కర్స్ గురించి చెప్పుకోవచ్చు. వీటికి ప్లేస్టోర్‏లో 4.6 రెటింగ్ ఉంది. ఇదే కాకుండా.. ఇంకా చాలా రకాల హోలీ స్టిక్కర్స్ అందుబాటులో ఉన్నాయి. 5. ఇందులో మీకు 5 ప్యాక్స్ కనిపిస్తాయి. దేనిపైనా క్లిక్ చేసినా మీకు హోలీ సెంట్రిక్ స్టి్క్కర్స్ కనిపిస్తాయి. 6. అంతే వాటిని డౌన్ లోడ్ చేసుకున్నాక యాడ్ వాట్సప్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆపైన పాప్ అప్ లోని యాడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అంతే వెంటనే అవి మీ వాట్సప్‏కు యాడ్ అవుతాయి. 7. ఈ యాడ్ చేసుకున్న వాట్సప్‏ స్టిక్కర్లను మళ్లీ స్టిక్కర్స్ పేజీలోకి వెళ్లి. స్టిక్కర్స్ మెనూలోని ప్లస్ సింబర్ పై క్లిక్ చేయండి. 8. అంతే అందులో మీకు నచ్చిన హోలీ స్టిక్కర్లను మీ ఆత్మీయులకు పంపి ఎంజాయ్ చేయండి. 9. ఐఫోన్ వినియోగదారులకు వాట్సప్‏లో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ప్లేస్టోర్‏లో సెర్చ్ చేసిన స్టిక్కర్లను వాట్సప్‏కు యాడ్ చేయడానికి వీలు లేదు. అందుకే వీరు మీ సన్నిహితుల నుంచి వచ్చే స్టిక్కర్లను సేవ్ చేసుకోని… మీ ఆత్మీయులకు పంపి విష్ చేయవచ్చు.

Also Read:

Holi 2021: హోలీ సంబరాల్లో భాంగ్ ఎందుకు తాగుతారో తెలుసా.. ఈ సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే..