AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2021:కరోనా నిబంధనలను పాటిస్తూ.. సేఫ్ గా రంగుల పండుగను జరుపుకుంటున్న హీరోయిన్లు జెనీలియా, రష్మిక, రకుల్

రంగుల హొలీ ఆనందాల కేళి.. హిందువుల పండగల్లో ముఖ్యమైన పండగ హొలీ.. అయితే ఈ పండగ విశిష్టత ఏమిటంటే.. కులమతాలకు అతీతంగా ఈ పండగను సంతోషంగా జరుపుకుంటారు.. తాజగా కరోనా మళ్ళీ విజృంభిస్తున్న...

Holi 2021:కరోనా నిబంధనలను పాటిస్తూ.. సేఫ్ గా రంగుల పండుగను జరుపుకుంటున్న హీరోయిన్లు జెనీలియా, రష్మిక, రకుల్
Actresses Holi Celebration
Surya Kala
| Edited By: Phani CH|

Updated on: Mar 29, 2021 | 12:38 PM

Share

Holi 2021: రంగుల హొలీ ఆనందాల కేళి.. హిందువుల పండగల్లో ముఖ్యమైన పండగ హొలీ.. అయితే ఈ పండగ విశిష్టత ఏమిటంటే.. కులమతాలకు అతీతంగా ఈ పండగను సంతోషంగా జరుపుకుంటారు.. తాజగా కరోనా మళ్ళీ విజృంభిస్తున్న వేళ.. చాలా ప్రభుత్వాలు ఎక్కువ మంది కలిగి హోలీని చేసుకోవడంపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. అయితే కుటుంబం సభ్యుల మధ్య హోలీని నిర్వహించుకోవచ్చు అంటూ.. కొంత వెసులుబాటు కూడా కల్పించింది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యుల మధ్య కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు అంటూ రంగులు చల్లుకుంటూ హొలీ పండగను నిర్వహించుకున్నారు.. అలా సెలబ్రేట్ చేసుకున్న వీడియో లను సోషల్ మీడియాద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.. కోవిడ్ నేపాధ్యంలో మన సెలబ్రెటీలు ఎలా హొలీ సెలబ్రేట్ చేసుకున్నారో చూద్దాం రండి..

బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన జెనీలియా తన భర్త రితేష్‌ దేశ్‌ముఖ్ తో కలిసి హొలీ ని సెలబ్రేట్ చేసుకుంది. ఆ వీడియో ని షేర్ చేసి.. కరోనా నేపథ్యంలో అందరూ సేఫ్ గా హొలీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతూ విషెస్ చెప్పింది.

ఊహలు గుసగుసలాడే చిత్రంలో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రాశి ఖన్నా.. విభిన్న సినిమాలతో యూత్ ను కట్టుకుంది. ఈ అందాల రాశి రాశి ఖన్న ఈ సారి హోలీని తన అన్నతో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది. చిన్నపిల్లలుగా మారిపోయి.. హొలీ సెలబ్రేట్ చేసుకుంది. ఎంతో ఫన్నీగా ఉన్న వీడియో అందరినీ ఆకట్టుకుంది. కుర్రకారు కలల సుందరి పంజాబీ పిల్ల రకుల్ ప్రీతి సింగ్ .కరోనా నేపథ్యంలో ఈ సారి హోలీని తనకు తానె సెలెబ్రేట్ చేసుకున్నట్లుంది, ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి.. అందరికీ హొలీ శుభాకాంక్షలు తెలిపింది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

కన్నడ సోయగం… రష్మిక మందన్న బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫేమస్ హొలీ సాంగ్ రంగ బర్సెబీ చునర్ వాలీ రంగు బర్సే సాంగ్ తో హోలీని సెలబ్రేట్ చేసుకుంది. అమితాబ్ లా డ్యాన్స్ చేస్తూ.. ఎంజాయ్ చేసింది హోలీని

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్.. రంగులతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి.. ఈ ఏడాది హొలీ స్పెషల్.. అందుకనే మనం గతంలో హొలీ జరుపుకున్న సమయంలో తీసుకున్న పిక్స్ ను మళ్ళీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హొలీ పండుగను శుభాకాంక్షలు చెప్పుకుందాం అని అంది మాధురీ దీక్షిత్.

Also Read: తనను తినడానికి వచ్చిన చిరుత పులితో హైడ్ అండ్ సీక్ ఆడిన కుందేలు… సోషల్ మీడియాలో వీడియో వైరల్

హోలీకి ముందు రోజు కరోనా కలకలం.. మరోసారి తెలంగాణలో గుబులు.. కొత్తగా 535 మందికి పాజిటివ్‌