- Telugu News Photo Gallery Cinema photos Sai pallavi rare and unseen childhood pics goes viral in social media
ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్.? ఎవరో గుర్తు పట్టగలరా.! ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!
పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్. సినీ ఇండస్ట్రీలో ఒకటే పీస్. డ్యాన్స్‌లలో గ్రేస్, హీరోలకు పోటీ ఇస్తూ కోట్లాది అభిమానులను సంపాదించుకుంది.
Updated on: Mar 29, 2021 | 4:39 PM

ఆమె ఎవరో కాదు సాయి పల్లవి. టాలీవుడ్‌లోకి ఫిదా సినిమాతో అరంగ్రేటం చేసి.. హైబ్రీడ్ పిల్లగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.

డ్యాన్స్ అంటే సాయిపల్లవికి చాలా ఇష్టం. ఆమె ఈటీవీలో ప్రసారమైన ఢీ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

సాయిపల్లవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'కస్తూరి మాన్' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన ధామ్ ధూమ్ సినిమాలో ఆమె స్నేహితురాలిగా నటించింది. నెక్ట్స్ మలయాళంలో 'ప్రేమమ్' అనే సినిమాలో నటించింది.

ఎంతో ఇష్టమైన డ్యాన్స్‌ను సాయి పల్లవి.. చిన్నప్పుడు మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ నేర్చుకుంది.

సాయిపల్లవి జార్జియాలోని టీబీలీసీ నుంచి మెడిసిన్ పూర్తిచేసింది. తనకు కార్టియాలజిస్ట్ కావాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి తన చర్మం గురించి చెప్పుకొచ్చింది. మొదట్లో పింపుల్స్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని.. తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పుకోచ్చింది.

సాయి పల్లవి నటించిన విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఇక సాయి పల్లవిపై చిత్రీకరించిన 'సారంగదరియా' సాంగ్ ఇటీవల యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ కొల్లగొడుతోంది.




