AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీకి ముందు రోజు కరోనా కలకలం.. మరోసారి తెలంగాణలో గుబులు.. కొత్తగా 535 మందికి పాజిటివ్‌

coronavirus: ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,06,742కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది.

హోలీకి ముందు రోజు కరోనా కలకలం.. మరోసారి తెలంగాణలో గుబులు.. కొత్తగా 535 మందికి పాజిటివ్‌
AP Corona virus
Sanjay Kasula
|

Updated on: Mar 29, 2021 | 11:54 AM

Share

Telangana coronavirus: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ కలవర పెడుతోంది. ఇంతకాలం తక్కువ కేసులు నమోదైన రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు భయం మొదలైంది. శనివారం రాత్రి 8గంటల నుంచి ఆదివారం రాత్రి 8గంటల వరకు 33,930 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 403పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,06,742కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది.

కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి మరో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1690కు చేరింది. కరోనా బారి నుంచి శనివారం 313మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం 4,583 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారుల పేర్కొన్నారు. వీరిలో 1,815 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగ, మిగిలిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలావుంటే, ఒక జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 146 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 1,00,53,026 కొవిడ్‌ టెస్టులు నిర్వహించారు.

ఇక యాదాద్రిలో కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. విద్యాసంస్థలు, ఆలయాలు కరోనాకు హాట్‌స్పాట్స్‌గా మారాయి. ముఖ్యంగా యాదాద్రిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నిన్నటి వరకు 35 మందికి కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. యాదాద్రి అర్చకులు, సిబ్బంది ఆ మహమ్మారి బారిన పడ్డారు. యాదాద్రి ఆలయంలో మొత్తం 71కి చేరాయి పాజిటివ్‌ కేసులు. ఒకవైపు కేసులు..మరోవైపు హోలీ వేడుకలు..దీంతో అప్రమత్తమైన ప్రభుత్వాలు మాస్క్‌ తప్పనిసరి చేశాయి. మరి ప్రజలు వాటిని ఎంతవరకు ఫాలో అవుతున్నారన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

ఇవి కూడా చదవండి: Old Vehicles: డొక్కు వాహనాలను నడుపుతున్నారా ? అయితే బహుపరాక్‌.. ఇవి నడిపితే ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసా..

ఈ లోహం బంగారం కంటే మూడు రెట్లు ఎక్కువ విలువైనది..! ప్లాటీనం కాదు..! బిట్‌కాయిన్‌ను మించిపోయింది..!

LIC Alert: పాలసీదారులకు ముఖ్య గమనిక..! అలాంటి ఎస్ఎంఎస్ వస్తే స్పందించకండి..!