AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Old Vehicles: డొక్కు వాహనాలను నడుపుతున్నారా ? అయితే బహుపరాక్‌.. ఇవి నడిపితే ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసా..

మీరు రోడ్లపై డొక్కు వాహనాలను నడుపుతున్నారా ? అయితే బహుపరాక్‌ .. పాత వాహనాలపై భారీ పన్ను విధించేందుకు కేంద్రం రెడీ అయ్యింది. 15 ఏళ్ల పైబడ్డ వాహనాలు నడిపితే భారీగా గ్రీన్‌ టాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.

Old Vehicles: డొక్కు వాహనాలను నడుపుతున్నారా ? అయితే బహుపరాక్‌.. ఇవి నడిపితే ఎంత ట్యాక్స్ పడుతుందో తెలుసా..
Old Vehicles On Indian Road
Sanjay Kasula
|

Updated on: Mar 29, 2021 | 9:01 AM

Share

Old Vehicles on Indian Roads: కాలం చెల్లిన వాహనాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల డొక్కు వాహనాలు తిరుగుతున్నట్టు గుర్తించారు. వీటిలో దాదాపు 70 లక్షల వాహనాలు ఒక్క కర్ణాటకలోనే ఉన్నాయి. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్ర రవాణా శాఖ విడుదల చేసింది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్‌, లక్షద్వీప్‌ వివరాలు ఇందులో లేవు.

డొక్కు వాహనాలుగా (15 ఏళ్లు పైబడ్డ వాహనాను)

15 ఏళ్ల పైబడిన వాహనాలను డొక్కు వాహనాల కింద పరిగణిస్తారు. ఈ వాహనాలతో కాలుష్యం బాగా పెరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో వీటి వాడకాన్ని తగ్గించేలా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా స్వతంత్ర వాహన తుక్కు విధానాన్ని తీసుకొస్తోంది. పాత వాహనాలపై హరిత పన్ను విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది.

రెండు కోట్ల వాహనాలు (20 ఏళ్లు పైబడినవి)

నాలుగు కోట్ల పాత వాహనాల్లో రెండు కోట్లు 20 ఏళ్ల పైబడినవి కూడా ఉన్నట్లు తేలింది. ఈ జాబితాలో 70 లక్షల పాత వాహనాలతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా.. ఉత్తర్‌ప్రదేశ్‌ 56 లక్షలు , ఢిల్లీలో 50 లక్షలు , కేరళలో 35 లక్షలు, తమిళనాడులో 33 లక్షలు, పంజాబ్‌లో 25 లక్షల వాహనాలు ఉన్నట్టు గుర్తించారు. ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, అసోం, బిహార్‌, గోవా, త్రిపుర, దాద్రా నగర్‌ హవేలీ, దామణ్‌ దీవ్‌లో ఒక లక్ష నుంచి 5.44 లక్షల మధ్య ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో డొక్కు వాహనాల సంఖ్య లక్ష కంటే తక్కువే ఉన్నాయి.

కాలుష్యానికి కారణమయ్యే ఈ వాహనాలన్నింటిపై హరిత పన్ను విధించాలని కేంద్రం యోచిస్తోంది. హైబ్రిడ్‌, విద్యుత్తు, సీఎన్‌జీ, ఇథనాల్‌, ఎల్‌పీజీ వంటి ఇంధనాలతో నడిచే వావహనాలకు పన్ను నుంచి మినహాయింపునివ్వబోతున్నారు. హరిత పన్ను కింద వసూలయ్యే ఆదాయంతో కాలుష్య నివారణ చర్యలు చేపడుతారు.

ఇవి కూడా చదవండి: Petrol Diesel Rates: సామాన్యుడికి ఊరట.. స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఇదే ఇవాళ్టి ట్రెండ్‌..

Viral Video: పాముపై ఊరేగిన కప్ప…!! స్నేహితులుగా మారిన అజాత శత్రువులు… ( వీడియో )