AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SMS: ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌ఎంఎస్ (SMS)‌లపై కొత్త నిబంధనలు.. రూల్స్‌ పాటించకపోతే నిలిపివేత.. ఆదేశాలు జారీ చేసిన ట్రాయ్‌

SMS: భారీ మొత్తం ఎస్‌ఎంఎస్‌ (బల్క్‌ ఎస్‌ఎంఎస్‌)లను పంపే సంస్థలు కొత్త నిబంధనలు పాటించాలని, లేకపోతే మార్చి 31వ తేదీ తర్వాత వినియోగదారులకు సేవల్లో అంతరాయం

SMS: ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌ఎంఎస్ (SMS)‌లపై కొత్త నిబంధనలు.. రూల్స్‌ పాటించకపోతే నిలిపివేత.. ఆదేశాలు జారీ చేసిన ట్రాయ్‌
Sms
Subhash Goud
|

Updated on: Mar 29, 2021 | 9:29 AM

Share

SMS: భారీ మొత్తం ఎస్‌ఎంఎస్‌ (బల్క్‌ ఎస్‌ఎంఎస్‌)లను పంపే సంస్థలు కొత్త నిబంధనలు పాటించాలని, లేకపోతే మార్చి 31వ తేదీ తర్వాత వినియోగదారులకు సేవల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ, వాణిజ్య సంస్థలకు లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ సేవలకు సాంకేతిక సాయం అందించే నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ), సిడాక్‌, స్టాఫ్ట్‌వేర్‌ సంస్థల సంఘం నాస్‌కామ్‌, పరిశ్రమ వాణిజ్య సంఘాలు సీఐఐ-ఫిక్కీ అసోచాం, టెలికాం నెట్‌వర్క్‌ సంస్థల సంఘం కోయ్‌లకు రాసిన లేఖలో వాణిజ్య ఎస్‌ఎంఎస్‌లు పంపేందుకు అమలు చేయాల్సిన నిబంధనలను మరోసారి గుర్తు చేసింది.

అయితే బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లు పంపే కంపెనీలు, ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ సంస్థలు టెలి మార్కెటింగ్‌ నిబంధనలకు అనుగుణంగా పేర్లు నమోదు చేసుకోవాలని ట్రాయ్‌ స్పష్టం చేసింది. ఇందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. లేని పక్షంలో ఎస్‌ఎంఎస్‌లు పంపే సమయంలో అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. అంతేకాదు విఫలమైతే కంపెనీల పేర్లు తమ వెబ్‌సైట్లో ఉంచతామని వెల్లడించింది. గడువు ముగిసిన తర్వాత కూడా నియంత్రణ సంస్థకు అనుగుణంగా నమోదు కానట్లయితే టెలికం వనరులను ఉపయోగించి పెద్ద మొత్తంలో సందేశాలను పంపడానికి వారికి అనుమతించరు.

మోసపూరిత ఎస్‌ఎంఎస్‌లను కట్టడి చేసేందుకే..

కాగా, మోసపూరిత సందేశాలను కట్టడి చేసేందుకే ఈ నిబంధనలు విధిస్తున్నట్లు ట్రాయ్‌ తెలిపింది. దీని ప్రకారం వివధ సంస్థలు పంపే వాణిజ్యపరమైన ఎస్‌ఎంఎస్‌లను వినియోగదారులకు చేరడానికి ముందు నిర్ధిష్ట నమోదిత సందేశ నమూనాలతో టెలికాం కంపెనీలు సరిపోల్చి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.

ఇందుకోసం టెల్కోలు బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఇందులో ఐడీల నుంచి వచ్చిన సందేశాలను మాత్రం అధికారికమైనవిగా భావించి సమ్మతించి కస్టమర్లకు పంపుతాయి. అయితే నమోదు చేసుకోని ఐడీల నుంచి వచ్చే సందేశాలను నిలిపివేస్తాయి. ఈ విధానాన్ని ఎస్‌ఎంఎస్‌ స్క్రబింగ్‌గా వ్యవహరిస్తారు.

ఇవీ కూడా చదవండి: Driving Licences: మీకు రివర్స్‌ గేర్‌లో వాహనం నడపడం వచ్చా..? అయితే కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Gas Cylinder Booking: మీ వంట గ్యాస్‌ సిలిండర్‌ను ఇలా బుక్‌ చేసుకుంటే రూ.170కే సిలిండర్‌ను పొందవచ్చు