NEET PG 2021: నీట్ పీజీ దరఖాస్తు చేసుకుని ఫీజు కట్టలేదా? మరేం పర్వాలేదు.. ఫీజు చెల్లింపు తేదీని పొడిగించిన ఎన్‌బీఈ..
NEET PG 2021: నీట్ పీజీ ఫీజు కట్టలేదా?.. టెన్షన్ పడకండి.. నీట్ పోస్ట్ గ్రాడ్యూయేషన్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్షకు ఫీజు చెల్లించని వారికి..
NEET PG 2021: నీట్ పీజీ ఫీజు కట్టలేదా?.. టెన్షన్ పడకండి.. నీట్ పోస్ట్ గ్రాడ్యూయేషన్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్షకు ఫీజు చెల్లించని వారికి మరో అవకాశం లభించింది. నీట్ పీజీ కోసం దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించని అభ్యర్థులు.. మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు ఫీజు చెల్లించొచ్చు. ఇదే విషయాన్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్‌బీఈ) ప్రకటించింది. ఫీజు చెల్లించని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nbe.edu.in ద్వారా అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చునని వెల్లడించింది. పోస్టు గ్రాడ్యూయేట్ జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్ పీజీ 2021) అప్లికేషేషన్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 1,74,886 మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వెల్లడించింది. అయితే, వీరిలో 1063 మంది అభ్యర్థులు ఫీజు కట్టలేదని పేర్కొంది. ఫీజుు కట్టని వారికి మళ్లీ అవకాశం ఇస్తున్నామని, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు ఎన్‌బీఈ సూచించింది.
ఇదిలాఉంటే.. ఏప్రిల్ 18వ తేదీన నీట్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డును ఏప్రిల్ 12వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఎన్‌బీఈ తెలిపింది. నీట్ పీజీ 2021 ఫలితాలను మే 31వ తేదీన ప్రకించనున్నారు.
Also read: