Jobs In Kia Motors: ఏపీలోని కియా మోటార్స్‌లో ఉద్యోగాలు.. పరీక్షకు ఇంకా ఒక్కరోజే గడువు.. పూర్తి వివరాలు..
Jobs In Kia Motors: అనంతపురం జిల్లా పెనుకొండలో ఉన్న ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటార్స్ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) భాగస్వామ్యంతో ఈ నియామకాలను చేపడుతున్నారు...
Jobs In Kia Motors: అనంతపురం జిల్లా పెనుకొండలో ఉన్న ప్రముఖ కార్ల కంపెనీ కియా మోటార్స్ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) భాగస్వామ్యంతో ఈ నియామకాలను చేపడుతున్నారు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు భర్తీ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ విషయమై APSSDC ట్వీట్ చేసింది.
ముఖ్యమైన విషయాలు..
* ఉత్తరాంధ్ర జిల్లాల్లో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ ద్వారా నీమ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. * ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 200 స్థానాలను భర్తీ చేయనున్నారు. * ఇందులో భాగంగా ఆన్‌లైన్ టెస్ట్‌ను మార్చి 30, 2021న నిర్వహించనున్నారు. * ఆన్‌లైన్ టెస్టులో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. * ఈ పోస్టులకు ఏదైనా బ్రాంచ్‌లో డిప్లొమా పూర్తి చేసిన వారి అప్లై చేసుకోవచ్చు. * 2016-2020 మధ్య ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. * అయితే ఈ ఉద్యోగాలు కేవలం పురుషులకు మాత్రమే. * ఎంపికైన అభ్యర్థులకు రూ.14,000 నుంచి రూ.15000 వేతం అందిస్తారు. * శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాలో జరిగే డ్రైవ్‌కు, తూర్పుగోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లాల అభ్యర్థులు విశాఖపట్నంలో జరిగే డ్రైవ్‌కు హాజరు కావాలి. * పూర్తి వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు ఫోన్ చేయమని సూచించారు.
APPSSDC చేసిన ట్వీట్..
#APSSDC Helpline 1800 425 2422 (MON – SAT), 08:00 AM to 08:00 PM
Kia Motors India Now Hiring pic.twitter.com/VgQSceFZgV
— APSSDC HELPLINE 18004252422 (@ApssdcH) March 24, 2021