AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KVS Admission 2021: కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఎప్పటినుంచంటే..?

Kendriya Vidyalaya Sangathan: కేంద్రియ విద్యాలయ సంఘటన్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తరగతిలో అడ్మిషన్లకు

KVS Admission 2021: కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఎప్పటినుంచంటే..?
Kvs Admission 2021
Shaik Madar Saheb
|

Updated on: Mar 27, 2021 | 9:31 PM

Share

Kendriya Vidyalaya Sangathan: కేంద్రియ విద్యాలయ సంఘటన్ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తరగతిలో అడ్మిషన్లకు రిజిస్ట్రేషన్ల కోసం కేంద్రీయ విద్యాలయ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు తేదీల వివరాలను సైతం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2021-22లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఏప్రిల్ 1l ఉదయం 10 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు ఏప్రిల్ 19వ తేదీ సాయంత్రం 7 గంటల నాటికి ముగుస్తుందని కేంద్రియ విద్యాలయ సంఘటన్‌ వెల్లడించింది. ప్రవేశ వివరాలను అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.in ద్వారా KVS Android మొబైల్ యాప్‌ ద్వారా పొందవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

కాగా.. 2 లేదా అంతకంటే ఎక్కువ తరగతుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్ 8 ఉదయం 8గంటల నుంచి ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం 4 గంటల మధ్య జరగనుంది. అయితే 1వ తరగతి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్ మోడ్‌లో.. 2వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ తరగతుల అడ్మిషన్ల ప్రక్రియను ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఆయా చోట్ల ఉన్న ఖాళీ సీట్లను బట్టి 2 లేదా అంతకంటే ఎక్కువ తరగతులకు ప్రవేశం ఉంటుంది.

దీంతోపాటు 2021-2022 విద్యాసంవత్సరంలో.. 11వ తరగతిలో ప్రవేశం కోసం కేంద్రీయ విద్యాలయం సూచించిన ప్రకారం.. కేవీఎస్‌ (హెచ్‌క్యూ) వెబ్‌సైట్ – kvsangathan.nic.in నుంచి రిజిస్ట్రేషన్ ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశానికి సంబంధించిన సమాచారం కోసం స్థానికంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలను సందర్శించవద్దని ఆన్‌లైన్‌లోనే పూర్తిచేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది.

ఒకటో తరగతిలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత.. కేవీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో మొదటి ప్రవేశ జాబితాను విడుదల చేస్తుంది. మొదటి జాబితా తరువాత సీట్లు ఖాళీగా ఉంటే రెండు, మూడు నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ఈ జాబితాలను కేంద్రీయ విద్యాలయాలు తమ తమ అధికారిక వెబ్‌సైట్లలో విడుదల చేస్తాయి. ప్రస్తుతం, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఆధ్వర్యంలో మొత్తం 1,247 విద్యాలయాలు ఉన్నాయి.

Also Read:

Medicines Prices Hike: ఏప్రిల్‌ 1 నుంచి ఈ మందులపై బాదుడే.. బాదుడు…భారీగా పెరగనున్న ఔషధ ధరలు

PhD Holder Cheating : పీహెచ్‌డీ చేసి.. నలుగురు తోపుగాళ్లకి ఉద్యోగాలిచ్చి.. 500 మంది @ 7 కోట్లు, కట్ చేస్తే కటకటాలు