AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Terrible Scene: మహబూబాబాద్‌లో భయానక దృశ్యం.. ఆ ఇంట్లో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 120 పాములు.. వరుసగా వస్తూనే ఉన్నాయి..

Terrible Scene: సాధారణంగా ఒక పాము కనిపిస్తేనే హడలిపోతాం. పాము అంత దూరంలో ఉంటే.. మనం ఇక్కడి నుంచే పారిపోతాం...

Terrible Scene: మహబూబాబాద్‌లో భయానక దృశ్యం.. ఆ ఇంట్లో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 120 పాములు.. వరుసగా వస్తూనే ఉన్నాయి..
Snakes
Shiva Prajapati
|

Updated on: Mar 29, 2021 | 7:22 AM

Share

Terrible Scene: సాధారణంగా ఒక పాము కనిపిస్తేనే హడలిపోతాం. పాము అంత దూరంలో ఉంటే.. మనం ఇక్కడి నుంచే పారిపోతాం. అలాంటిది నిత్యం జీవనం సాగించే ఇంట్లోనే పాముల కుంపటి ఉంటే.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 120 పాములు ఉంటే..? వామ్మో ఇంకేమైనా ఉందా!. కానీ ఓ వ్యక్తి ఇంటి ఆవరణలో పాముల కుప్ప బయటపడింది. ఒకదాని తరువాత ఒకటి మొత్తం 120 పాములు బయటపడ్డాయి. అది చూసి ఆ ఇంటి యజమాని సహా.. స్థానిక ప్రజలు హడలిపోయారు. పూర్తి వివరాల్లోకెళితే.. మహబూబాబాద్ జిల్లాలో పాములు కలకలం రేపాయి. నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో ఎండీ మహబూబ్ అలీ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో తల్లిపాముతో పాటు సుమారు 120కి పైగా పాము పిల్లలు ప్రత్యక్షం అయ్యాయి. ఇవాళ తెల్లవారు జామున ఇంట్లోకి పాము రావడంతో మహబూబ్ అలీ దాన్ని చంపేశాడు. ఆ తరువాత మరో పాము వచ్చింది. దాన్ని కూడా చంపేశాడు. ఇలా వరుసగా పాములు బయటకు వస్తుండటంతో హడలిపోయారు ఆ ఇంటి సభ్యులు. వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చి వారి సహాయంతో పాములన్నింటినీ చంపేశారు. కాగా, ఒకేసారి పాముల కుప్పలు బయటపడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇదిలాఉంటే.. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ ఇంట్లోంచి కుప్పలు కుప్పలు పాము పిల్లలు బయటకు వచ్చాయి. అది కూడా బెడ్ రూమ్‌ నుంచి రావడంతో ఆ ఇంటి యజమాని తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలో 12 పాములు బెడ్‌రూమ్‌లోని మంచం కింది నుంచి వచ్చాయి. అయితే, ఆ పాములన్నింటినీ చంపేశారు.

Also read:

సీఎం పళనిస్వామిపై నీచమైన వ్యాఖ్యల ప్రతిఫలం, తమిళనాట ఆగ్రహజ్వాలలు.. మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఎ రాజాపై కేసు

West Bengal elections : దక్షిణ 24 పరగణాల జిల్లాలో వెలుగుచూసిన 48 నాటు బాంబులు, దేశీయంగా తయారు చేసిన తుపాకీలు

IND vs ENG 3rd ODI : వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. చివరి వన్డేలో 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘన విజయం‌