Subramaniam Badrinath: మరో మాజీ క్రికెటర్‌కు కరోనా.. ఆందోళనలో పలువురు స్టార్ ఆటగాళ్లు

మాజీ క్రికెటర్లల్లో కరోనా భయం వెంటాడుతోంది. శుక్రవారం క్రికెట్ మాజీ దిగ్గజం.. సచిన్ టెండూల్కర్‌కు, ఆ తర్వాత శనివారం మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో మాజీ క్రికెటర్‌కు పాజిటివ్‌గా

Subramaniam Badrinath: మరో మాజీ క్రికెటర్‌కు కరోనా.. ఆందోళనలో పలువురు స్టార్ ఆటగాళ్లు
Subramaniam Badrinath
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 29, 2021 | 2:13 AM

Badrinath cricketer – Coronavirus: మాజీ క్రికెటర్లల్లో కరోనా భయం వెంటాడుతోంది. శుక్రవారం క్రికెట్ మాజీ దిగ్గజం.. సచిన్ టెండూల్కర్‌కు, ఆ తర్వాత శనివారం మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా మరో మాజీ క్రికెటర్‌కు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ ఎస్‌.బద్రీనాథ్‌కు కరోనా సోకింది. పరీక్షలు చేయించుకోగా ఆదివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు సుబ్రమణియన్ బద్రినాథ్ ట్విట్ చేశాడు. తాను అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని.. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నానని ఆయన తెలిపాడు. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లానని.. వైద్యుడి సలహా మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు బద్రీనాథ్ ట్విట్ చేశాడు. తాజాగా బద్రినాథ్‌కు కరోనా సోకడంతో.. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న వారిలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది.

ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్, యూసఫ్ పఠాన్, బద్రీనాథ్ సైతం పాల్గొన్నారు. కాగా బద్రీనాథ్ ఇండియా లెజెండ్స్ తరుపున ఆడాడు. వారితోపాటు వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ సహా పలువురు భారత మాజీ క్రికెటర్లు సైతం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సచిన్‌ టెండూల్కర్‌ అనంతరం యూసఫ్‌కు, ఆ తర్వాత బద్రీనాథ్‌కు పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో పలువురు మాజీ ఆటగాళ్లల్లో భయం మొదలైంది. అయితే.. రాయ్‌పుర్‌లో జరిగిన రోడ్‌సేఫ్టీ సిరీస్‌కు వేల సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించారు. అక్కడ కోవిడ్ నిబంధనలేవీ పాటించలేదని.. నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:

రచ్చ రచ్చగా మారిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశం.. అంబుడ్స్ మెన్ నియామకంపై మాటల యుద్ధం..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ దిగ్గజం కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ దిగ్గజం కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!