Viral Video: తనను తినడానికి వచ్చిన చిరుత పులితో హైడ్ అండ్ సీక్ ఆడిన కుందేలు… సోషల్ మీడియాలో వీడియో వైరల్
అడవిలో కౄరజంతువులు, సాధుజంతువులు నివసిస్తుంటాయి.. ప్రకృతి ధర్మం ప్రకారం.. సింహం, పులి వంటి కౄర జంతువులకు సాధు జంతువులు కూడా ఆహారంగా మారతాయి. అది ప్రకృతి ధర్మం...
Viral Video: అడవిలో కౄరజంతువులు, సాధుజంతువులు నివసిస్తుంటాయి.. ప్రకృతి ధర్మం ప్రకారం.. సింహం, పులి వంటి కౄర జంతువులకు సాధు జంతువులు కూడా ఆహారంగా మారతాయి. అది ప్రకృతి ధర్మం. అయినా జింక, కుందేలు వంటి జంతువులను.. సింహం, పులి వేటాడి తింటే మనం అయ్యో అని అనుకుంటాం.. తాజాగా ఓ కుందేలును చిరుతపులి వేటాడుతున్న వీడియో ఒకటి హల్ చల్ చేస్తుంది..
అడవిలో అందంగా బుజ్జి బుజ్జి గా ఉన్న ఓ కుందేలు పై చిరుతపులి కన్ను పడింది. ఆ కుందేలును వేటాడి ఆహారంగా తినెయ్యాలని భావించి కొంచెం దూరంలో మాటేసింది. .. అదను చూసి కుందేలు మీదకు దూకింది.. అయితే పరుగుల రాణి కుందేలు తక్కువేమీ కాదు.. చిరుత తనమీదకి దూకగానే… ఒక్కసారిగా పరుగు లంకించుకుంది.. చెంగుచెంగున దూకుతూ చిరుతకు అందకుండా అడవిలోని మొక్కల్లోని తుప్పల్లో నుంచి దురుకుంటూ.. వేగంగా తప్పించుకుని చిరుతపులికి జెల్ల కొట్టి వెళ్ళిపోయింది. దీంతో చేతిదాకా వచ్చిన ఆహారం నోటికి అందకపోవడంతో చిరుత ముఖం చిన్నబోయింది.
అసలు చిరుత కళ్ళకు కుందేలు కనిపించిన వెంటనే దాడి చేయలేదు.. అదే విధంగా చిరుతను చేసిన కుందేలు వెంటనే హడావిడిగా పారిపోలేదు.. ఒకరినొకరు చూసుకుంటూ.. దాడి చేయడానికి చిరుత ప్లాన్ చేస్తుంటే.. చిరుత మీద పడితే.. ఎలా తెప్పించుకోవాలా అని కుందేలు ఆలోచిస్తున్నట్లు ఉంది ఈ వీడియో.. దీంతో అందరికీ ఈ వీడియో తెగ నచ్చేసింది. కుందేలు.. చిరుత హైడ్ అండ్ సీక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్నతనంలో అడవిలోని జంవుతులను మృగరాజు నుంచి రక్షించుకోవడానికి కుందేలు చూపిన తెలివి.. సాహసం ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్ట్లు .. మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి మరి..
The rabbit has a skill in running away. pic.twitter.com/4W8P1MkZmm
— Life and nature (@afaf66551) March 25, 2021
Also Read: మీ కళ్ళను భద్రం చేసే టిప్స్ ను పాటించండి…. రంగుల కేళి.. హోలీని ఎంజాయ్ చేయండి
దేశంలో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు..
జబర్ధస్త్ షూటింగ్ సెట్లో టీమ్ లీడర్ల మధ్య గొడవ.. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వర్ష..