Corona Cases India: దేశంలో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు..

Corona Cases India: భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ వేలల్లో పెరుగుతూనే ఉన్నాయి. దీనితో...

Corona Cases India: దేశంలో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు..
Corona-Virus-India
Follow us

|

Updated on: Mar 29, 2021 | 10:43 AM

Corona Cases India: భారత్‌లో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ వేలల్లో పెరుగుతూనే ఉన్నాయి. దీనితో ప్రజల్లో ఒకింత ఆందోళన నెలకొంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 68 వేల మార్క్ దాటింది. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఇంత భారీగా ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దేశంలో నిన్న కొత్తగా 68,020 కేసులు నమోదయ్యాయి. అలాగే మహమ్మారి కారణంగా 291 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,20,39,644 కరోనా కేసులు నమోదు కాగా.. 1,61,843 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు.

కాగా గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి నుంచి 32,231 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 1,13,55,993 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,21,808 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 94.32శాతం ఉండగా.. మరణాల రేటు 1.34శాతం ఉంది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 9,13,319 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరు 24,18,64,161 పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. కాగా, దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధించారు.

Also Read:

ఏపీ విద్యార్ధులకు ముఖ్య గమనిక.. ఆ రెండు పథకాల రిజిస్ట్రేషన్లకు రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి.!

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!

Latest Articles