నందిగ్రామ్ లో రెండు బలమైన ‘కొండలను’ ఢీకొననున్న చిట్టి అభ్యర్థి, వయస్సు 36 ఏళ్ళే !

బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యంగా అందరి కళ్ళూ నందిగ్రామ్ నియోజకవర్గం మీదే ! సాక్షాత్తూ ఇక్కడ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి రెండు పెద్ద కొండల్లా బరిలో ఉన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 11:11 am, Mon, 29 March 21
నందిగ్రామ్ లో రెండు బలమైన 'కొండలను' ఢీకొననున్న చిట్టి అభ్యర్థి, వయస్సు 36 ఏళ్ళే !
Minakshi  Mukherjee

బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యంగా అందరి కళ్ళూ నందిగ్రామ్ నియోజకవర్గం మీదే ! సాక్షాత్తూ ఇక్కడ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి రెండు పెద్ద కొండల్లా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో వీరిని ఎదుర్కొని ధైర్యంగా పోటీ చేయడమంటే మాటలు కాదు. కానీ నేను సిధ్దం అంటూ వచ్చింది 36 ఏళ్ళ మీనాక్షి ముఖర్జీ.. ఇంతకీ ఈమె ఏ  పార్టీ నుంచి పోటీ చేస్తోందంటే.. లెఫ్ట్ పార్టీల అభ్యర్థిగా బరిలో నిలుచుంది. గేమ్ ఈజ్ ఆన్, జైశ్రీరామ్ నినాదాల మధ్య ఈమె నినాదమల్లా ఒక్కటే.. అదే.. యువతకు ఉద్యోగావకాశాల కల్పన.. ఈ నియోజకవర్గంలో ఎంతోమంది యువత ఉద్యోగాల్లేక తల్లడిల్లుతున్నారని, ఈ ఎన్నికల్లో తాను  గెలిస్తే వారి జాబ్స్ కు  రక్షణగా ఉంటానని మీనాక్షి హామీ ఇస్తోంది. మమతకు, సువెందు అధికారికి తను గట్టి పోటీనివ్వగలనని ఈమె అంటోంది. మమత, అధికారి లాగా ఈమెకు ప్రచారం కోసం సొమ్ముల్లేవు. అందుకే ఒక్కోసారి కాలినడకన, ఒక్కోసారి టాప్  లేని ఆటో ఎక్కి ప్రచారం చేస్తోంది. తనకు మనీ పవర్ లేదని, కానీ జనం ‘పవర్’ ఉందని,  అది చాలునని అంటోంది.

గత కొన్నేళ్లుగా ఈ రాష్ట్రానికి గానీ… నిజం చెప్పాలంటే ఈ నియోజకవర్గానికి గానీ ఈ నాయకులు చేసిందేమీ లేదని, అందరూ దోచుకున్నారని మీనాక్షి ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటివారు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్, పోలీసులు తమ బాధ్యతలను సకమ్రంగా నిర్వర్తిస్తే.. నందిగ్రామ్ లో  బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు రావని ఆమె చెప్పింది. నేనీ ఎన్నికల్లోవాస్తవ సమస్యలమీద పోటీ చేస్తున్నాను.. అంతేగానీ మతాల పేరు చెప్పి కాదు అని మీనాక్షి పేర్కొంది. పదేళ్లుగా ఈ నియోజకవర్గ ప్రజలను మోసగించిన బీజేపీ, టీఎంసీ పార్టీలవారు   ఇప్పుడు ఓట్లకోసం ఇక్కడికి వస్తున్నారు అని ఆమె నిప్పులుకక్కింది.

 

మరిన్ని ఇక్కడ చదవండి: Holi 2021: పెళ్ళి తర్వాత వచ్చే ప్రతి పండుగ ప్రత్యేకమైనదే.. హోలీ సంబరాలను ప్లాన్ చేసుకుంటున్న చందమామ..

Income Tax: ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని కీలక ప్రతిపాదనలు.. మార్చి 31లోగా చేసేయండి..లేకుంటే భారీగా పెనాల్టీ.!