AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని కీలక ప్రతిపాదనలు.. మార్చి 31లోగా చేసేయండి..లేకుంటే భారీగా పెనాల్టీ.!

Income Tax: నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు 2021 ఏప్రిల్​ 1 నుంచి..

Income Tax: ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని కీలక ప్రతిపాదనలు.. మార్చి 31లోగా చేసేయండి..లేకుంటే భారీగా పెనాల్టీ.!
Income Tax
Subhash Goud
|

Updated on: Mar 29, 2021 | 11:47 AM

Share

Income Tax: నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయ పన్ను నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు 2021 ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించే వారంతా ఈ కొత్త నిబంధనల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇబ్బందులు పడటం ఖాయం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. వేతన జీవులకు అండగా నిలిచేలా.. ఆదాయపు పన్ను దాఖలు చేయని వారిపై కొరడా ఝులింపించేలా ఈ నిబంధనలు ఉన్నాయి.

ఆమె ప్రతిపాదనల ప్రకారం, పన్ను పరిధిలోకి వచ్చే ఏ వ్యక్తి అయినా సరే గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్​ దాఖలు చేయకపోతే వారిపై టీడీఎస్​ రేటు కాస్త అధికంగానే విధించాలనే ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇది కూడా ఇన్​కమ్​ టాక్స్​ చట్టంలోని 206 ఎబి, 206 సిసిఎ నిబంధనలకు లోబడే ఉంటుంది. చాలా మంది ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలను ప్రోత్సహించడానికే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. అంటే 2021 ఏప్రిల్ 1 నుండి ఒక వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చినా సరే ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్)ను దాఖలు చేయని సందర్భంలో, అతని బ్యాంక్ డిపాజిట్లపై రెట్టింపు టిడిఎస్ వడ్డీ వసూలు చేయబడుతుంది.

ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఆ రోజు నుంచి పలు అంశాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అందువల్ల మార్చి నెల వచ్చిందంటే ప్రజలు కొత్త నిబంధనలపై తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. గత సంవత్సరం కరోనా మహహ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువు పెంచిన విషయం తెలిసిందే. ఇందులో పాన్‌ కార్డును ఆధార్‌ కార్డుతో అనుసంధానించడం, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వీటి గడువు 2021 మార్చి 31వ తేదీతో ముగియనుండటంతో ప్రతి ఒక్కరు ఈ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఐటీఆర్‌ ఫైలింగ్‌

ఆర్థిక ఏడాదికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోతే భారీ ఖర్చులను భరించాల్సి వస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది కాబట్టి, తొందరగా ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఒక వేళ గడువు దాటిన తర్వాత ఐటీఆర్‌ దాఖలు చేస్తే రూ.10వేల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5 లక్షల ఆదాయం వరకు ఉన్న చిన్న చెల్లింపుదారులు రూ.1000 ఆలస్య రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే అప్రమత్తమై మార్చి 31లోగా మీ ఐటీఆర్‌ దాఖలును పూర్తి చేసుకుంటే మంచిది.

పాన్‌కార్డు ఆధార్‌ లింక్‌

పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు లింక్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా సార్లు గడువు పొడిగించింది. ముందుగా చాలా డెడ్‌లైన్లు పెట్టినప్పటికీ, చివరగా దీనిని 2021 మార్చి 31 వరకు పొడిగించింది. ఈలోగా మీ పాన్‌ నెంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేయకపోతే ఆ నెంబర్‌ పని చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరపడం కుదరదు. అందుకే 31లోగా ఈ పని పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.

ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌ స్కీమ్‌

ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌ పథకం కింద బిల్లులు అందజేసేవారు ప్రయోజనాలను పొందేందుకు మార్చి 31 వరకు మీ బిల్లులను సరైన ఫార్మాట్‌లో ప్రభుత్వానికి అందజేయాలి. ఆ బిల్లులో జీఎస్టీ మొత్తం, వోచర్‌ నెంబర్‌ వంటి వాటిని పేర్కొనాలి. ఈ పథకాన్ని 2020 అక్టోబర్‌ నెలలో కేంద్ర సర్కార్‌ ప్రకటించింది.

డబుల్ టాక్సేషన్​ నివారణకు డిక్లరేషన్​

కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువ మంది విదేశీ పౌరులు, ప్రవాసీయులు భారత్‌లోనే ఉండాల్సి వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వారు ఇక్కడ సంపాదించిన ఆదాయంపై డబుల్‌ టాక్సేషన్‌ కట్టాల్సి వస్తోంది. అటువంటి వారు మార్చి 31లోగా ప్రభుత్వానికి డిక్లరేషన్‌ సమర్పించి డబుల్‌ టాక్సేషన్‌ నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపింది. 2021 మార్చి 3న సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌ విడుదల చేసినదాని ప్రకారం.. డబుల్‌టాక్స్‌ను ఎదుర్కొంటున్నవారు ఫారం-NRలో ఆయా వివరాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.

వివాద్‌ సే విశ్వాస్‌

2020 మార్చి 17న అమల్లోకి వచ్చిన వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం డిక్లరేషన్‌ దాఖలు చేయడానికి గడువు మార్చి 31 వరకు ఉంది. పెండింగ్‌లో ఉన్న ఆదాయపను పన్ను తగ్గించడం, ప్రభుత్వానికి సకాలంలో ఆదాయాన్ని సంపాదించడంతో పాటు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31లోపు ఈ పనులు చేసుకుంటే మంచిది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేసుకుంటే ఎంతో మంచిది. లేకపోతే భారీగా జరిమానా పడటం, ఇబ్బందులు పడటం తప్పనిసరి.

ఇవీ చదవండి: LIC Housing Finance: కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌… ఆరు నెలల ఈఎంఐ (EMI)లు మాఫీ.. ఎలాగంటే..!

Income Tax: ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని కీలక ప్రతిపాదనలు.. మార్చి 31లోగా చేసేయండి..లేకుంటే భారీగా పెనాల్టీ.!

SMS: ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌ఎంఎస్ (SMS)‌లపై కొత్త నిబంధనలు.. రూల్స్‌ పాటించకపోతే నిలిపివేత.. ఆదేశాలు జారీ చేసిన ట్రాయ్‌

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ