Holi 2021: పెళ్ళి తర్వాత వచ్చే ప్రతి పండుగ ప్రత్యేకమైనదే.. హోలీ సంబరాలను ప్లాన్ చేసుకున్న చందమామ..

Happy Holi 2021 - Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న..

Holi 2021: పెళ్ళి తర్వాత వచ్చే ప్రతి పండుగ ప్రత్యేకమైనదే.. హోలీ సంబరాలను ప్లాన్ చేసుకున్న చందమామ..
Kajal Aggarwal
Follow us
Rajitha Chanti

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 29, 2021 | 11:47 AM

Happy Holi 2021: కాజల్ అగర్వాల్.. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న.. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తోంది. అంతేకాకుండా.. ప్రవీణ్ సత్తారు, అక్కినేని నాగార్జున కాంబోలో రాబోతున్న సినిమాలోను నటించనుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును అక్టోబర్ 30న వివాహం చేసుకుంది. ఇక వివాహం అనంతరం ఈ జంట ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అటు గౌతమ్ తన బిజినెస్ పనుల్లో బిజీగా ఉండగా… కాజల్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. వీరి పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండుగ హోలీ. దీంతో ఈ హోలీని మరింత అందంగా సెలబ్రెట్ చేసుకోవాలనుకుంటుందంట కాజల్. ఇందుకోసం ఎన్నో ప్లాన్స్ కూడా సిద్దం చేసుకుంటుందంట.

చిన్నప్పటి నుంచి హోలీ సంబరాలకు కాజల్ జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక ఈ ఏడాది కూడా తన భర్త గౌతమ్‏తో కలిసి మొదటి హోలీని అందంగా జరుపుకునేందుకు సిద్ధమైంది ఈ చందమామ. కరోనా వైరస్ నిబంధనలను పాటిస్తూనే.. తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హోలీ సంబరాలను చేసుకోబోతున్నట్లుగా వెల్లడించింది కాజల్. ఈ సంవత్సరం చాలా సైలెంట్ హోలీ కానుంది. కేవలం మా కుటుంబ సభ్యులతో కలిసి విందు… ఆ తర్వాత పూజా కార్యాక్రమాలు మాత్రమే చేయాలి అనుకుంటున్నాము. అలాగే సేంద్రీయ రంగులతోపాటు, తియనైన కాచోరీలతో ఈ వేడుకలను జరుపుకుంటాము అంటూ చెప్పుకోచ్చింది కాజల్.

ప్రతి పండుగ చాలా ప్రత్యేకమైనదే. ఇక ముఖ్యంగా వివాహం తర్వాత మా మొదటి పండుగ ఇది. ఈ సంబరాలను కేవలం మా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే జరుపుకుంటామని తెలిపింది. చిన్నప్పుడు హోలీకా రాక్షసిని కాల్చడం ఆ తర్వాత రంగులు చల్లుకోవడం వంటివి ఎన్నో జ్ఞాపకాలున్నాయి. హోలీ రోజున నా స్నేహితులతో కలసి రెయిన్ డ్యాన్సులు చేయడం.. నా కుటుంబంతో కలిసి స్వీట్స్ తినడం.. నీటి బెలూన్లు విసిరేయడం ఇలా చాలా జ్ఞాపకాలున్నాయని తెలిపింది. ఈ సంవత్సరం తన ఆత్మీయులతో కలసి ఈ వేడుకలను జరుపుకుంటుందని.. వచ్చే ఏడాది కూడా తన ప్రియమైన వారితో కలిసి ఈ వేడుకలను జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పుకోచ్చింది కాజల్.

Also read:

Vishwak Sen: ‘హిట్’ సినిమా కంటే ముందే ‘పాగల్’ స్టోరీ విన్నాను.. నో చెప్పాలనుకున్న కానీ.. విశ్వక్ సేన్..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!