Vishwak Sen: ‘హిట్’ సినిమా కంటే ముందే ‘పాగల్’ స్టోరీ విన్నాను.. నో చెప్పాలనుకున్న కానీ.. విశ్వక్ సేన్..

Vishwak Sen BirthDay: 'ఫలక్ నామా దాస్' సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్నాడు యంగ్ హిరో విశ్వక్ సేన్. ఇటీవలే 'హిట్'

Vishwak Sen: 'హిట్' సినిమా కంటే ముందే 'పాగల్' స్టోరీ విన్నాను.. నో చెప్పాలనుకున్న కానీ.. విశ్వక్ సేన్..
Vishwak Sen
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 29, 2021 | 7:23 AM

Vishwak Sen BirthDay: ‘ఫలక్ నామా దాస్’ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకున్నాడు యంగ్ హిరో విశ్వక్ సేన్. ఇటీవలే ‘హిట్’ సినిమాతో మరో సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఎప్పుడూ.. ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకునే విశ్వక్ సేన్.. తాజాగా తన రూటు మార్చుకున్నాడు. పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ‘పాగల్’ సినిమాతో రాబోతున్నాడు. సోమవారం విశ్వక్ సేన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

నాకు స్టోరీ చాలావరకు తొందరగా నచ్చవు. అందుకే కథలను వినాలనుకోని వెళ్లే ముందు.. కచ్చితంగా నో చెప్పాలనుకుంటా.. అయితే డైరెక్టర్స్ చెప్పే కథలు నాకు నచ్చితేనే ఒప్పుకుంటా.. అలాగే పాగల్ స్టోరీకి కూడా నో చెప్పాలనుకున్నా.. కానీ కథ విన్నాక అసలు వదులుకోకుడదు అనిపించింది. నిజానికి స్ర్కిప్ట్ హిట్ సినిమా కన్నా ముందే విన్నాను. కానీ హిట్ స్టోరీ ముందే రెడీ అవ్వడంతో దానినే పట్టాలెక్కించా అని చెప్పుకోచ్చాడు. అయితే ఈ పాగల్ టైటిల్ చూసి.. నేను కూడా పాగల్ అనుకుంటున్నారు. ప్రేమించినప్పుడు కొంతమంది పిచ్చోళ్లలా ఆలోచిస్తుంటారు. అలాంటిదే మా కథ. సినిమా చూశాక మనలో అలాంటి ప్రేమికులు ఉన్నారనే విషయం అర్థమవుతుంది. అందుకే ఈ స్టోరీకి తగ్గట్టుగా టైటిల్ ఫిక్స్ చేశాం. ఫుల్ కామెడీతోపాటు.. ఎమెషనల్‏గా ఉంటుంది ఈ మూవీ. డైరెక్టర్ నరేశ్ కుప్పిలి డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సంవత్సరం మొత్తం మూడు సినిమాలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రస్తుతం ప్రాజెక్ట్ గామీ అనే సినిమా చేస్తున్నాను. దాదాపు షూటింగ్ పూర్తైంది. గ్రాఫిక్స్ పనులు మాత్రమే ఉన్నాయి. అలాగే.. ఓ మై కడావులే అనే తమిళ సినిమా రీమేక్ చేయబోతున్నాం. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కాబోతుంది. అలాగే బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సాగర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాను. అంతేకాకుండా.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ సిక్వెల్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఇలా నేను బిజీగా ఉండడంతో.. డేట్స్ సర్దుబాటు కాక హిట్ 2 వదులుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకోచ్చాడు విశ్వక్ సేన్.

Also read:

ఈ సినిమాలు చూస్తే రూ.71 వేలు ఇస్తారట.. ఇవే కాకుండా ఇంకా బోలెడన్నీ ఆఫర్లు.. ఎక్కడో తెలుసా..