AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Jain: అమ్మ ఇచ్చిన గిఫ్ట్ చూసి బాధపడుతున్న అమ్ములు.. కారణాన్ని చెప్పుకుంటున్న ప్రియాంక జైన్..

ప్రియాంక జైన్.. అనగానే ఠక్కున గుర్తుకువచ్చే రూపం మౌనరాగం ఫేం అమ్ములు... మౌనరాగం సీరియల్లో మాటలు రాని అమ్మాయి.. అమ్ములుగా

Priyanka Jain: అమ్మ ఇచ్చిన  గిఫ్ట్ చూసి బాధపడుతున్న అమ్ములు.. కారణాన్ని చెప్పుకుంటున్న ప్రియాంక జైన్..
Priyanka Jain
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2021 | 7:52 PM

Share

ప్రియాంక జైన్.. అనగానే ఠక్కున గుర్తుకువచ్చే రూపం ‘మౌనరాగం’ ఫేం అమ్ములు… మౌనరాగం సీరియల్లో మాటలు రాని అమ్మాయి.. అమ్ములుగా నటించిన ప్రియాంక జైన్.. సీరియల్ కంటే ముందే వెండితెరకు పరిచయమైంది. ‘చల్తే చల్తే’, ‘వినరా సోదరా వీర కుమారా’, ‘ఎవరూ తక్కువ కాదు’ సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. మౌనరాగం సీరియల్ అనంతరం.. ప్రియాంక జైన్.. ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ ద్వారా మరోసారి బుల్లితెర అభిమానులను అలరిస్తుంది. ఇందులో ప్రియాంక జైన్‎తోపాటు ‘సిరిసిరి మువ్వలు’ ఫేమ్ ‘అమర్దీప్ చౌదరి’ హీరోగా నటిస్తుండగా.. నాటి స్టార్ హీరోయిన్ రాశి ఈ సీరియల్‌లో హీరోయిన్‌కి అత్తగా నటించి మెప్పిస్తోంది. ఇదిలా ఉండే.. ప్రియాంక జైన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గానే ఉంటుంది. తన పర్సనల్ విషయాలతోపాటు.. సీరియల్స్ అప్‏డేట్స్ ఇస్తూ.. అభిమానులకు టచ్‎లో ఉంటుంది ఈ అమ్మడు.

Priyanka Jain 1

Priyanka Jain 1

తాజాగా తన ఇన్‏స్టాగ్రామ్‏లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన తల్లి బహుమతిగా ఇచ్చిన గిటార్‏ను ప్రేమగా పట్టుకోని.. దానిని ప్లే చేయడానికి ప్రయత్నించింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీన్ని ఎలా ప్లే చేయాలో నాకు తెలియదు.. ఏనీవే థ్యాంక్స్ మమ్మా అంటూ రాసుకోచ్చింది అమ్ములు. ప్రియాంక షూటింగ్‏లో కాస్తా బ్రేక్ దొరకడంతో ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. ఈ సమయంలోనే తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అమ్ములు కొత్త సీరియల్ ‘జానకి కలగనలేదు’ విషయానికి వస్తే.. చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే అందమైన అమ్మాయి.. పెద్దగా చదువుకోలేని స్వీట్ కొట్టు అబ్బాయికి మధ్య చిగురించిన అందమైన ప్రేమకథ. తన కొడుకు కంటే కోడలు ఎక్కువగా చదువుకున్నది కాకుడదనుకునే అత్త.. కూతురికంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయికి పెళ్ళి చేయాలకునే తండ్రి. అయితే ఐపీఎస్ కావాలనునే జానకి తన కలని ఎలా వదిలేసుకుంటుంది అనేది స్టోరీలో చూడవచ్చు.

Also Read:

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బర్త్ డే సెలబ్రెషన్స్.. సంబరాలు చేసుకుంటున్న అభిమానులు..

‘వైల్డ్ డాగ్’ మూవీ ప్రమోషన్స్ పెంచిన నాగార్జున.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‏లో బేస్ క్యాంప్ ఈవెంట్..