Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బర్త్ డే సెలబ్రెషన్స్.. సంబరాలు చేసుకుంటున్న అభిమానులు..

Vishwak Sen BirthDay Celebrations: ఫలక్ నుమా దాస్ సినిమాతో ఫాంలోకి వచ్చాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఆ తర్వాత 'హిట్' సినిమాతో

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ బర్త్ డే సెలబ్రెషన్స్.. సంబరాలు చేసుకుంటున్న అభిమానులు..
Vishwak Sen Birthday Celebr
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2021 | 6:23 PM

Vishwak Sen BirthDay Celebrations: ఫలక్ నుమా దాస్ సినిమాతో ఫాంలోకి వచ్చాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఆ తర్వాత ‘హిట్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఈ మాస్ కా దాస్ హీరో. ప్రస్తుతం పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇందులో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని మే1న థియేటర్లలోకి తీసుకురానున్నట్లుగా ప్రకటించారు చిత్రయూనిట్. మ్యాజికల్ లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందుతుండగా.. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‏తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.

ఈ మూవీ తర్వాత విశ్వక్ సేన్ ఏప్రిల్ 3 నుంచి పీవీవీ సినిమా బ్యానర్‌లో ఓ మై క‌డువ‌లే రీమేక్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. సోమవారం (మార్చి 29న) మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఆయన ఫ్యాన్స్ ఆదివారం నుంచి సంబరాలు మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే.. ఆదివారం సాయంత్రం విశ్వక్ సేన్ బర్త్ డే సెలబ్రెషన్స్ హైదరాబాద్‏లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను మీరు టీవీ9 లైవ్ టెలికాస్ట్‏లో చూడవచ్చు. ఇక హిట్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విశ్వక్ సేన్.. హిట్ 2లో ఎందుకు నటించట్లేదు అనే విషయం పై క్లారిటీ ఇచ్చాడు. తనకు డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్లే హిట్ 2 సినిమా చేయలేకపోతున్నానని.. ప్రస్తుతం తాను మూడు సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పుకోచ్చాడు.

టీవీ9 లైవ్..